CM Revanth : సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మల్లారెడ్డి
CM Revanth : గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
- By Latha Suma Published Date - 01:02 PM, Wed - 9 October 24

MLA Malla Reddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తన మనవరాలి వివాహానికి రేవంత్‌రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు. రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ కార్డు ఇచ్చిన మల్లారెడ్డి..కుటుంబ సమేతంగా రావాలని కోరారు. రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహా ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు ఇచ్చారు.
Read Also: Jitan Ram : హర్యానాలో బీజేపీ విజయానికి ప్రధాని మోదీ నాయకత్వమే కారణం
కాగా, గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టారు. దాంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని మల్లారెడ్డి అనుచరులు ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
భూములను ఆక్రమించి కాలేజీలు నిర్మించారని మల్లారెడ్డిపై గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలపై ఇద్దరు నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. ఓ సందర్భంలో మల్లారెడ్డి తొడగొట్టి ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేయాలని పరస్పరం డిమాండ్ చేసుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆ సమయంలో డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థతి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో మల్లారెడ్డి మింగలేక కక్కలేక ఇబ్బంది పడ్డారు.
Read Also: PM Modi : నేడు మహారాష్ట్రలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన