PM Modi : నేడు మహారాష్ట్రలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన
PM Modi : షిర్డీ విమానాశ్రయంలో రూ.645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణ కార్యక్రమాలను మోడీ ప్రారంభించబోతున్నారు. ఇది నాగ్‌పూర్- విదర్భ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
- By Latha Suma Published Date - 12:29 PM, Wed - 9 October 24

Maharashtra: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (బుధవారం) మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ మోడ్‌లో ఈ కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. ఇందులో ముఖ్యంగా నాగ్‌పూర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి రూ.7,000 కోట్ల విలువైన అప్‌గ్రేడింగ్ పనులను ప్రారంభించనున్నారు. అలాగే షిర్డీ విమానాశ్రయంలో రూ.645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణ కార్యక్రమాలను మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ టెర్మినల్ షిర్డీని సందర్శించే మతపరమైన పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సాయిబాబాకు సంబంధించిన వేప చెట్టు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఇది నాగ్‌పూర్- విదర్భ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
Read Also: KTR : అద్భుతమైన పునరాగమనం చేశారు.. ఓమర్ అబ్దుల్లాకు కేటీఆర్ అభినందనలు
అంతేకాకుండా ముంబయి, నాసిక్, అమరావతి సహా మహారాష్ట్ర అంతటా కొత్తగా పది వైద్య కళాశాలలను ఇనాగ్యురేట్ చేయనున్నారు. ఇక, టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబయి.. అధునాతన సాంకేతికత- మెకాట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి రంగాల్లో ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వనుంది. దీంతో పాటు చాట్‌బాట్ టెక్నాలజీ ద్వారా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులకు కీలకమైన అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ డేటాను అందించడానికి విద్యా సమీక్షా కేంద్రాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
Read Also: DMK : 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే సన్నాహాలు.. 200 సీట్లు లక్ష్యం..!