Rajnath Singh : ఖర్గే 125 ఏళ్లు బతకాలి.. 125 ఏళ్లు ప్రధానిగా మోడీ ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh : ఖర్గే మాట్లాడుతూ, మోడీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన వయస్సు 83 ఏళ్లని, ఇప్పుడిప్పుడే చనిపోనంటూ వ్యాఖ్యానించారు.
- Author : Latha Suma
Date : 30-09-2024 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
Mallikarjun Kharge: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్యానాలో సోమవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ..మల్లికార్జున్ ఖర్గే 125 ఏళ్లు బతకాలని, ప్రధాని మోడీ 125 ఏళ్లు ప్రధానిగానే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
కాగా, మల్లికార్జున్ ఖర్గే జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వేదికపై స్పృహతప్పి పడిపోతున్న తరుణంలో భద్రతా సిబ్బంది, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయన దగ్గరకు వెళ్లిపట్టుకున్నారు. కొద్దిసేపు ప్రసంగాన్ని నిలిపివేసిన అనంతరం తిరిగి ఖర్గే మాట్లాడుతూ, మోడీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన వయస్సు 83 ఏళ్లని, ఇప్పుడిప్పుడే చనిపోనంటూ వ్యాఖ్యానించారు.