HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kejriwals Successor Is Atishi

Delhi CM : కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?

Kejriwal successor is Atishi: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.

  • Author : Latha Suma Date : 15-09-2024 - 5:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kejriwal's successor is Atishi
Kejriwal's successor is Atishi

Kejriwal successor is Atishi ..?: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్‌ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ వారసులెవరనే ఓ చర్చ అయితే సర్వత్ర జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.

పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలో సైతం అతిషి కీలకం..

2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో ఆమె కీలకంగా వ్యవహరించారు. అలాగే పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో అతిషి తనదైన ముద్ర వేశారు. దీంతో పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలో సైతం అతిషి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ కేబినెట్‌లో అత్యధిక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న ఒకే ఒక్క మంత్రి అతిషి. ఆమె అజమాయిషీలో 11 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. దీంతో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా అతిషి ఉన్నారని సుస్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎంగా అతిషిని ఎంపిక చేస్తారని ఊహాగానాలు ఊపందుకోన్నాయి. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాను జైల్లో ఉన్నానని.. ఈ నేపథ్యంలో త్రివర్ణ పతాకాన్ని అతిషి ఎగురవేస్తుందంటూ సీఎం కేజ్రీవాల్.. న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సెనాకు లేఖ సైతం రాసిన సంగతి తెలిసిందే. కానీ ఆ అవకాశాన్ని కేజ్రీవాల్ కేబినెట్‌లోని మరో మంత్రికి కల్పిస్తూ.. ఢిల్లీ ఎల్జీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన అనంతరం స్పందించిన అతిషి…

కేజ్రీవాల్ రాజీనామా అనంతరం అతిషి స్పందిస్తూ.. బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ఎన్నికలకు భయపడుతుందని విమర్శించారు. అందుకే ఆప్ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తుందని మండిపడ్డారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసిన కేసుల్లో ఒక్క ఆధారాన్ని సైతం బీజేపీ చూపించలేక పోయిందని గుర్తు చేశారు.
అందుకే ఢిల్లీ ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడతాయని స్పష్టం చేశారు. ఇక సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జార్ఖండ్, మహారాష్ట్రతోపాటు నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Read Also: World Expensive Medicine: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్, ధర వింటే ఆశ్చర్యపోతారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam aadmi party
  • Aravind Kejriwal
  • Aravind Kejriwal successor
  • Atishi
  • bjp
  • NEXT DELHI CM

Related News

    Latest News

    • పాక్ కు బంగ్లా షాక్.. పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

    • Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

    • Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

    • IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

    • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

    Trending News

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd