HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kcrs Family Away From Lok Sabha Elections

KCR Family : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరం..!

  • Author : Latha Suma Date : 26-03-2024 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR's family away from Lok Sabha elections..!
KCR's family away from Lok Sabha elections..!

 

KCR Family: లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha elections) కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్‌(brs) కూడా పూర్తి అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. కేసీఆర్ కుటుంబం(KCR Family) నుంచి ప్రతిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో ఒకరు బరిలో ఉండేవారు. కాని.. ఈసారి మాత్రం పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌ నుంచి ఒక్కరు కూడా పోటీలో లేరు. 2004 నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తుంది. కానీ.. తొలిసారి 2024 లోక్‌సభ ఎన్నికలకు వారు దూరంగా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్ర సాధన కోసం 2001లో కేసీఆర్ స్థాపించారు. ఆ తర్వాత వచ్చిన 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి కేసీఆర్ గెలిచారు. అప్పుడే కాంగ్రెస్‌ యూపీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2006, 2008 ఉపఎన్నికల్లో కూడా బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. 2009లో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నుంచి కేసీఆర్ బరిలో నిలిచి మళ్లీ గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యింది. 2014లో టీఆర్ఎస్‌ తెలంగాణలో గవర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. కేసీఆర్ సీఎంగా కొనసాగారు. జమిలిగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు.

Read Also:  Trump: ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌నకు స్థానం

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌ రావు లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా వారెవరూ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగడం లేదు. నిజామాబాద్ నుంచి గతంలో ఒకసారి గెలుపొంది, మరోమారు ఓటమిపాలైన కవిత ఈసారి పోటీ చేయడం లేదు. సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ కుటుంబసభ్యులు లోక్​సభ ఎన్నికల పోటీకి దూరంగా ఉండడం ఇదే తొలిసారి.

Read Also: Delhi Metro: ఢిల్లీలో హై అలర్ట్‌.. మూడు మెట్రో స్టేషన్లను మూసివేత

1983లో తొలిసారి శాసనభకు పోటీ చేసి కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వరుసగా శాసనసభకు ఎన్నికవుతూ వచ్చారు. మధ్యలో కొన్ని లోక్‌సభ ఎన్నికలను మినహాయిస్తే కేసీఆర్ లేదా ఆయన కుటుంబసభ్యులు ఎవరో ఒకరు ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ మాత్రం కరీంనగర్ నుంచి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిల్చొంటున్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • KCR family
  • Lok Sabha polls
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd