AP : శ్రీవారిని దర్శించుకున్న జేపీ నడ్డా
- By Latha Suma Published Date - 11:16 AM, Sat - 11 May 24

JP Nadda: ఏపి లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో బీజేపీ(bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఈరోజు తిరుపతి(Tirupati)లో ఎన్నికల ప్రచారం(Election campaign)లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వెంకన్న సేవ చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం తీసుకున్నారు.
జేపీ నడ్డాకు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఆలయం బయట ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో మోడీ నాయకత్వంలో దేశం, సమాజం మరింత అభివృద్ధి చెందాలన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని వేడుకుంటున్నట్లు జేపీ నడ్డా తెలిపారు.
కాగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున జేపీ నడ్డా ఈరోజు తిరుపతిలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. ఈరోజు ఉదయం 9 గంటలకు తిరుపతిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు జేపీ నడ్డా రోడ్‌షో జరగనుంది. ఇందులో జనసేన నేత నాగబాబుతో పాటు టీడీపీ, జనసేన ముఖ్యనేతలు పాల్గొననున్నారు.