HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Indias Gaganyaan Astronauts What They Will Eat In Space

Gaganyaan-Idli : గగన్‌యాన్ ప్రయోగం.. ఇడ్లీపై అప్ డేట్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు ఫైటర్ పైలెట్లను ఇస్రో గుర్తించింది. రష్యా వీరికి ట్రైనింగ్ ఇస్తోంది. జీరో గ్రావిటీ, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలా ఈ నలుగురు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిని అంతరిక్షంలోకి పంపాక ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనే దానికి కూడా ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ మెనూలో ఇడ్లీలు(Gaganyaan-Idli)లేవని తెలుస్తోంది.

  • Author : Pasha Date : 03-06-2023 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gaganyaan Idli
Gaganyaan Idli

2024లో జరగనున్నమొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర “గగన్ యాన్” మిషన్ కు ఇండియా రెడీ అవుతోంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు ఫైటర్ పైలెట్లను ఇస్రో గుర్తించింది. రష్యా వీరికి ట్రైనింగ్ ఇస్తోంది. జీరో గ్రావిటీ, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలా ఈ నలుగురు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిని అంతరిక్షంలోకి పంపాక ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనే దానికి కూడా ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ మెనూలో ఇడ్లీలు(Gaganyaan-Idli)లేవని తెలుస్తోంది. వ్యోమగాములకు ఏయే ఫుడ్స్ ను ఇస్తే హెల్త్ కు మంచిది అనేది గుర్తించి సూచనలు చేసే బాధ్యతను కొన్ని సంస్థలకు అప్పగించారని అంటున్నారు. స్వల్పకాలిక స్పేస్ మిషన్‌ల సమయంలో మెనూలో ఇడ్లీ సాంబార్(Gaganyaan-Idli)   ఉండదు. దీర్ఘకాలిక స్పేస్ మిషన్‌ల సమయంలో చికెన్‌తో సహా అనేక రకాల కస్టమ్-మేడ్ ఫుడ్ ను అందుబాటులో ఉంచుతారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టాయి. అన్ని పరిస్థితులు అనుకూలంగా పరిణమిస్తే.. వచ్చే ఏడాది మన ఇండియా కూడా ఆ లిస్టులో చేరుతుంది.

మొదట ‘వ్యోమ్ మిత్ర’ను పంపాక..

గగన్ యాన్ లో భాగంగా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఇస్రో టెస్ట్ ప్లైట్ చేపట్టనుంది. దీని కోసం స్పేస్ ఫేరింగ్ హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపనుంది.  దీనికి  ‘వ్యోమ్ మిత్ర’ అని పేరు పెట్టారు.  ఆ టెస్ట్ ప్లైట్ లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా.. ఆ తర్వాత నలుగురు ఫైటర్ పైలెట్లను ఇస్రో అంతరిక్షంలోకి పంపుతుంది. గగన్ యాన్ ను ట్రాక్ చేయడానికి రిలే ఉపగ్రహాలను ఇస్రో వినియోగించనుంది.

Also read : First Chinese Into Space : అంతరిక్షంలోకి ఆ ప్రొఫెసర్.. ఎందుకంటే ?

వ్యోమగాముల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా ?

అంతరిక్షంలో వ్యోమగాముల లైఫ్ స్టైల్  డిఫరెంట్ గా ఉంటుంది.  గతంలో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు అక్కడ భోజనం చేయడంలో ఇబ్బందులు  ఎదుర్కొనేవారు. పసిపిల్లలు తినగలిగే ఆహారాన్నిమాత్రమే స్పేస్ కు తీసుకెళ్లేవారు. ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని ట్యూబ్ రూపంలో తీసుకునే వారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. వ్యోమగాములు ఇప్పుడు థర్మో-స్టెబిలైజ్డ్ (హీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్), తక్కువ తేమ ఉన్న ఆహారాన్ని తింటున్నారు. వ్యోమగాములు తినే ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటిల్లో నీరు ఉండదు. పండ్లు తిన్నట్టు తినొచ్చు. నీటితో కలిపి తినే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వీటి తయారీలో ప్రత్యేకంగా డబ్బాల్లో ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవేకాకుండా, సహజంగా తినే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గింజలు ఇతర పదార్థాలు ఉంటాయి. వీటిని కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. అయితే అంతరిక్షంలో ఆహారాన్ని వ్యోమగామి బరువును బట్టి, పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకుంటారు.

వ్యోమగాముల ఆహారంపై పరిశోధన

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు మెరుగైన ఆహారంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలు చేస్తోంది.  ప్ర‌స్తుతం అంతరిక్షంలో ఉంటున్న వ్యోమగాములు తీసుకునే ఆహారం.. వారిలో శారీరకంగా ఎలాంటి మార్పులకు కారణమవుతుంతో అర్థంచేసుకోడానికి నాసా శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ గ్రేస్ డ‌గ్ల‌స్ ఒక అధ్య‌య‌నం నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రస్తుతం స్పేస్‌ఫ్లైట్‌లో అందిస్తోన్న ఆహార‌ పద్ధతులను మెరుగుప‌రిచే విధానంపై దృష్టి పెట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astronauts
  • eat in space
  • food menu
  • Gaganyaan
  • Gaganyaan-Idli
  • idli
  • india
  • Indian Food
  • lifestyle
  • Mission

Related News

Jeans

జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

జీన్స్ క్లాత్ చెమటను సరిగ్గా పీల్చుకోదు. రాత్రంతా చర్మంపై తేమ, చెమట అలాగే పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతాయి.

  • PM Modi

    Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

  • Muskmelon Peel

    కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

  • IMF Chief Kristalina Georgieva

    Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా

  • Side Effects Of Chia Seeds

    చియా సీడ్స్ అతిగా తీసుకుంటే ప్రమాదకరమా?

Latest News

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

  • Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd