First Chinese Into Space : అంతరిక్షంలోకి ఆ ప్రొఫెసర్.. ఎందుకంటే ?
First Chinese Into Space : ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన చైనా వ్యోమగాములందరూ ఆ దేశపు సైనికులే.
- Author : Pasha
Date : 29-05-2023 - 8:46 IST
Published By : Hashtagu Telugu Desk
First Chinese Into Space : ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన చైనా వ్యోమగాములందరూ ఆ దేశపు సైనికులే. ఇప్పుడు తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపేందుకు డ్రాగన్ దేశం రెడీ అయింది. మంగళవారం రోజు (మే 30న) టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి మొదటి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బీజింగ్ యూనివర్శిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గుయ్ హైచావో రేపు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఆయన స్పేస్ పేలోడ్ నిపుణుడు కూడా.
Also read :China Dna Attack : టిబెటన్లపై డీఎన్‌ఏ అటాక్.. చైనా ఏం చేస్తోందంటే ?
చైనా అంతరిక్ష ప్రయోగాత్మక పేలోడ్‌ల ఆన్ ఆర్బిట్ ఆపరేషన్ లలో గుయ్ హైచావో(First Chinese Into Space) ఎక్స్ పర్ట్. అందుకే .. ఇతరులను కాదని ఆయన్ను ఎంపిక చేశారు. ఈ వివరాలను చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ ప్రతినిధి లిన్ జికియాంగ్ మీడియాకు వెల్లడించారు. ఇక ఈ మిషన్ లో ఆయనతో పాటు మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్, ఝు యాంగ్జ కూడా వెళ్తున్నారు. మంగళవారం ఉదయం 9.31 గంటలకు వాయవ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి వీరి స్పేస్ క్రాఫ్ట్ టేకాఫ్ అవుతుంది. చంద్రునిపై స్థావరాన్ని నిర్మించాలనే ప్లాన్ తో ఉన్న చైనా.. 2029 నాటికి మూన్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.