Beauty Parlour: బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దన్న భర్త.. ఉరేసుకున్న భార్య!
బ్యూటీ పార్లర్ కు వెళ్లొద్దు అన్నందుకు ఓ భార్య ఉరేసుకొని చనిపోయింది
- By Balu J Published Date - 05:37 PM, Sat - 29 April 23

ఇండోర్ (Indore) లోని ఓ మహిళ బ్యూటీపార్లర్ (Beauty Parlour)కు వెళ్లకుండా భర్త అడ్డుకోవడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రీనా యాదవ్ (34) అనే బాధితురాలు గురువారం నగరంలోని స్కీమ్ నంబర్ 51 ప్రాంతంలోని తన ఇంట్లో ఉరివేసుకుని (Hang) ఆత్మహత్యకు పాల్పడిందని సబ్ ఇన్‌స్పెక్టర్ ఉమాశంకర్ యాదవ్ తెలిపారు. “ఆమెను బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆవేశంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని ఆమె భర్త మాకు చెప్పాడు.
పోస్ట్‌మార్టం నిర్వహించి కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం” అని యాదవ్ తెలిపారు.ఘటన అనంతరం ఆమె భర్త (Husband) బలరాం పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెళ్లయి 15 ఏళ్లయినా బలరాం, రీనా మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Also Read: Harish on Rajinikanth: రజినీకి అర్ధమైంది కానీ.. గజినీలకు అర్థంకావడం లేదు: హరీశ్ రావు