Harish on Rajinikanth: రజినీకి అర్ధమైంది కానీ.. గజినీలకు అర్థంకావడం లేదు: హరీశ్ రావు
సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు వైసీసీ నాయకుల్లో తీవ్ర అసహనం రేపితే.. బీఆర్ఎస్ పార్టీల నేతల్లో ఆనందం నింపింది.
- By Balu J Published Date - 04:59 PM, Sat - 29 April 23
ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలో అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ స్వర్గీయ నందమూరి తారకరామారావు కొనియాడారు. అలాగే చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు కారణంగానే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ డెవలప్ మెంట్ కు చంద్రబాబు ఫౌండేషన్ వేస్తే, కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారని రజినీకాంత్ అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు వైసీసీ నాయకుల్లో తీవ్ర అసహనం రేపితే.. బీఆర్ఎస్ పార్టీల నేతల్లో ఆనందం నింపింది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు (Harish Rao) రియాక్ట్ అయ్యారు. ’’సీఎం కేసీఆర్ గారు అభివృద్ధి బాగా చేశారు చేశారని, 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ది, తెలంగాణ అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నది. పక్కరాష్ట్రంలో ఉన్న రజినీ గారికి అర్థమైంది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు’’ అని హరీశ్ రావు బీజేపీ (BjP), కాంగ్రెస్ (Congress) నాయకులనుద్దేశించి అన్నారు.
‘‘కేసీఆర్ (KCR) దించుతం, బిఆర్ఎస్ దించుతం అంటున్నరు కాంగ్రెస్ నాయకులు.. ఎందుకు దించుతరు..?? ఆసరా పింఛన్లు ఇస్తున్నందుకు దించుతరా.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకు దించుతరా.. ? కేసీఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకు దించుతరా..? రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకు దించుతరా? రైతుబీమా కింద ఐదు లక్షలు ఇస్తున్నందుకు దించుతరా? కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నందుకు దించుతరా? అని హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే, నిరుద్యోగులను రెచ్చ గొట్టే ప్రయత్నం ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read: Akkineni Amala: అఖిల్ ‘ఏజెంట్’ పై దారుణంగా ట్రోలింగ్.. తల్లి అమల రియాక్షన్ ఇదే!
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది