HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Harish Rao Will Soon Undertake The Padayatra

Padayatra : త్వరలో పాదయాత్ర చేపట్టనున్న హరీశ్‌ రావు

గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Author : Latha Suma Date : 12-02-2025 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao will soon undertake the padayatra
Harish Rao will soon undertake the padayatra

Padayatra : బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్లు హరీష్ రావు పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: New Pass Books : ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ

మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ మేరకు పాదయాత్ర తేదీలను ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో వెలువడితే.. ఎన్నికల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎన్నికలు ఏప్రిల్‌, మేలో ఉంటే.. ఈ నెలలోనే పాదయాత్ర మొదలుపెడతారు. ప్రతి రోజూ సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, అందోల్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుంది. సర్వే పూర్తయి భూసేకరణ దశలో నిలిచిపోయిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించి జిల్లాలోని 397 గ్రామాల్లో దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని హరీశ్‌రావు కోరుతున్నారు.

కాగా, రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం పోరాడదామని శ్రేణులకు సూచించారు. ఈ బాధ్యతను సీనియర్‌ నేత హరీశ్‌రావుకు అప్పగించారు. అందుకు అనుగుణంగానే హరీశ్‌రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

Read Also: Balakrishna : బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Basaveshwara lift projects
  • brs party
  • Ex Minister Harish Rao
  • kcr
  • padayatra
  • projects works
  • Sangameshwara

Related News

Ktr Grampanchayithi

అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు ఇక కాలం చెల్లింది – కేటీఆర్

తెలంగాణ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుంది. మాములుగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మొగ్గు చూపడం ఖాయం కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు బిఆర్ఎస్ వైపు మొగ్గుచూపిస్తుండడం బిఆర్ఎస్ అధిష్టానంలో కొత్త ఆశలు పుట్టేలా చేస్తున్నాయి.

  • Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

    BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

Latest News

  • రెడ్ జోన్‌లో ఢిల్లీ.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అల‌ర్ట్‌గా ఉండాల్సిందే!

  • లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం

  • జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

  • గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఓటరు పై కాసుల వర్షం

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

Trending News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd