SoundPod : గూగుల్ పే ‘సౌండ్ పాడ్’ వస్తోంది.. ధర, పనితీరు వివరాలివీ..
SoundPod : గూగుల్ త్వరలో గూగుల్‌పే 'సౌండ్పాడ్' డివైజ్‌ను ఇండియాలో లాంఛ్ చేయనుంది.
- Author : Pasha
Date : 25-02-2024 - 3:25 IST
Published By : Hashtagu Telugu Desk
SoundPod : గూగుల్ త్వరలో గూగుల్‌పే ‘సౌండ్పాడ్’ డివైజ్‌ను ఇండియాలో లాంఛ్ చేయనుంది. దీని ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, చాలా సులువుగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇది చిన్న, మధ్య తరహా వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి గూగుల్ కంపెనీ గత ఏడాదే సౌండ్పాడ్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చింది. దీనికి వ్యాపారుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే త్వరలో దీన్ని భారత్‌లో అఫీషియల్‌గా లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రానున్న నెలల్లో భారతదేశమంతటా అందుబాటులోకి తెస్తామని గూగుల్ పే ప్రకటించింది. గూగుల్ కంపెనీ భారతదేశంలో డిజిటల్ పేమెంట్ ల్యాండ్‌స్కేప్‌ను పెంచడానికి, సులభంగా సురక్షిత లావాదేవీలు నిర్వహించడానికి కృషి చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
పేమెంట్ ప్రాసెస్ ఇదీ..
- కస్టమర్లు గూగుల్ పే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు.
- గూగుల్ పే కస్టమర్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేసిన వెంటనే, ఈ గూగుల్ సౌండ్పాడ్ ఆ విషయాన్ని ఆడియో ద్వారా వ్యాపారులకు తెలియజేస్తుంది.
- దీనివల్ల వ్యాపారులు ప్రతీసారి తమ గూగుల్ పే అకౌంట్లోకి వెళ్లి, పేమెంట్స్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
Also Read : Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల
- మన దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారులకు గూగుల్ పే సౌండ్పాడ్ బాగా ఉపయోగపడుతుంది.
- ఇప్పటికే 2 కోట్ల మంది వ్యాపారులు పేటీఎం, ఫోన్‌పేలకు చెందిన సౌండ్ బాక్స్‌లను వాడుతున్నారు.
- గూగుల్ సౌండ్పాడ్తో పేటీఎం, ఫోన్‌పే సౌండ్ బాక్స్‌లను గట్టి పోటీ ఎదురుకానుంది.
- గూగుల్ పే సౌండ్పాడ్ ధర రూ.1494 నుంచి రూ.1660 దాకా ఉంటుంది.