HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Former Minister And Brs Leader Harish Rao Arrested

Harishrao : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు అరెస్టు

Harishrao : రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులను విడుదల చేసేదాకా.. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లేది లేదని హరీష్ రావు భీష్మించుకు కూర్చున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచుల పట్ల కర్కషంగా వ్యవహరించడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

  • Author : Latha Suma Date : 04-11-2024 - 3:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Former minister and BRS leader Harish Rao arrested
Former minister and BRS leader Harish Rao arrested

Farmer Sarpanches : గత కొన్ని రోజులుగా మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాజాగా వారు పోరుబాటకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. కొందరు సర్పంచులు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. సీఎం నివాసం సమీపంలో వారిని పోలీసులు అరెస్టు చేసి.. బొల్లారం పీఎస్‌కు తరలించారు. అయితే మాజీ సర్పంచ్‌ల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా తిరుమలగిరి రోడ్డుపై మాజీ మంత్రితో పాటు బీఆర్‌ఎస్ నాయులు నిరసనకు దిగారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని హరీష్‌తో పాటు గులాబీ పార్టీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి హరీష్‌రావు నిరసనకు దిగారు. కాగా.. హరీష్‌రావుతో పాటు మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులను విడుదల చేసేదాకా.. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లేది లేదని హరీష్ రావు భీష్మించుకు కూర్చున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచుల పట్ల కర్కషంగా వ్యవహరించడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పోరు తెలంగాణ ఇప్పుడు అరెస్టుల తెలంగాణ, నిర్భంద తెలంగాణ అయ్యిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచ్‌లను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. సర్పంచ్‌ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశారన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఆఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే సర్పంచ్‌ల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. మంచి పనులు చేసిన సర్పంచ్‌లకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటిందని.. పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదన్నారు. నాలుగైదు సార్లు హైదరాబాద్‌కు వచ్చి మోర పెట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి… సర్పంచ్‌లను చర్చలకు పిలవాలని.. వెంటనే వారి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ”లక్షా 50 వేల కోట్లతో మూసీ బాగు చేస్తా అంటున్నావు. కానీ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచ్‌లకు ఎందుకు శిక్ష వేస్తున్నావు. సర్పంచ్‌ల అరెస్టులు పరిష్కారం కాదు, సర్పంచ్‌ల ఫోన్లు గుంజుకొని టెర్రరిస్టుల లెక్క పోలీసు స్టేషన్లకు తీసుకుపోతున్నారు. మేము వచ్చి వారి బాధలు వినాలని వస్తే వారిని వెంటనే డీసీఎంలలో ఎక్కించి తరలిస్తున్నారు. భట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మాజీ సర్పుంచ్‌లు ఉన్నారు. నిన్న గాగ మొన్న బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు వీరికి ఎందుకు ఇవ్వడం లేదు. సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెంటనే సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి” అని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని.. వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. కానీ పేద సర్పంచ్‌లు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా అని నిలదీశారు.

Read Also:  Congres : రేపు తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • Bollaram PS
  • CM Revanth Reddy
  • Farmer Sarpanches
  • harishrao
  • Madhusudhana Chary

Related News

Telangana State Assembly Budget Sessions from March 16 to 30

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • Virosh Wedding

    ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd