First 3D Building : దేశంలోనే తొలి 3D పోస్టాఫీసు ప్రారంభం.. వీడియో చూడండి
First 3D Building : సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది..
- Author : Pasha
Date : 18-08-2023 - 1:03 IST
Published By : Hashtagu Telugu Desk
First 3D Building : సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది.. కాగితంపై పదాలు, ఫోటోలు ముద్రించినట్టే.. ఇప్పుడు మొత్తం బిల్డింగ్ ను దేశంలోనే తొలిసారిగా 3D ప్రింట్ తో ముద్రించారు.బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో ఉన్న 1100 చదరపు అడుగుల స్థలంలో పోస్టాఫీసు భవనాన్ని కేవలం 44 రోజుల రికార్డు టైంలో 3D ప్రింట్ తో ముద్రించారు. దీని నిర్మాణ ఖర్చు కూడా బాగా తగ్గింది. ఈ పోస్టాఫీస్ కు “కేంబ్రిడ్జ్ లేఅవుట్ పోస్ట్” అని పేరు పెట్టారు.
Also read : Maruti Celerio: మారుతి సుజుకి కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆగస్టు 31 వరకే ఛాన్స్..!
The spirit of Aatmanirbhar Bharat!
🇮🇳India’s first 3D printed Post Office.📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023
ఈ పోస్టాఫీసు భవనాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. అనంతరం ఆ బిల్డింగ్ కు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. “బెంగళూరు ఎప్పుడూ మన దేశానికి సంబంధించిన కొత్త చిత్రాన్ని అందరి ముందు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఇక్కడ నిర్మించిన 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనం మొత్తం భారతదేశానికి స్ఫూర్తి. భారతదేశం నేడు పురోగమిస్తోందని చెప్పడానికి ఇదొక నిదర్శనం” అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ త్రీడీ పోస్టాఫీసు నిర్మాణ పనులు మార్చి 21న ప్రారంభమై మే 3న ముగిశాయని అధికారులు వెల్లడించారు. త్రీడీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే దీని నిర్మాణ పనులు(First 3D Building) పూర్తయ్యాయి.
Also read : Air India ✈ : ₹.1,470/- కి ఎయిర్ ఇండియా విమాన టికెట్.. ప్రయాణికులకు బంపరాఫర్
3డీ ప్రింటెడ్ దేవాలయం తెలంగాణలో..
ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ దేవాలయం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని చర్విత మెడోస్ లో నిర్మాణం కానుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్పుజా ఇన్ ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నాయి. ఈ ఆలయం 3,800 చదరపు అడుగుల వైశాల్యం, 30 అడుగుల ఎత్తులో మూడు భాగాలుగా ఉండనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్ వేర్ తో నిర్మిస్తున్నారు.