Pune : పూణే లో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన
Pune : సతారా జిల్లా ఫల్తాన్ (Phaltan) ప్రాంతానికి చెందిన బాధిత యువతి పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది
- Author : Sudheer
Date : 27-02-2025 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలోని పూణే (Pune) నగరంలో ఢిల్లీ ‘నిర్భయ’ ఘటనను గుర్తు చేసే అమానుషమైన ఘటన జరిగింది. 26 ఏళ్ల యువతిపై బస్సులో దారుణ అత్యాచారం (Pune Woman Raped Inside Parked Bus) చోటు చేసుకుంది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్(Dattatreya Ramdas)గా గుర్తించారు. ఈ సంఘటన పూణే నగరంలోని స్వర్గేట్ బస్‌స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. సతారా జిల్లా ఫల్తాన్ (Phaltan) ప్రాంతానికి చెందిన బాధిత యువతి పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. ఆమె స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో ఈ దారుణం జరిగింది.
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
నిందితుడు బస్సు పక్కకు తీసుకెళ్లి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం బాధిత యువతి పోలీసులను ఆశ్రయించగా, వారు తక్షణమే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నప్పటికీ, అతని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Drone To Moon : చంద్రుడిపైకి తొలిసారిగా డ్రోన్.. ఎందుకో తెలుసా ?
ఈ ఘటన పూణే నగరంలో తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లోనే ఇటువంటి ఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా నేరస్తులకు ఉరిశిక్ష విధించేలా మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూణేలో జరిగిన ఈ ఘటన మరోసారి మహిళా భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.