Ashwini Vaishnaw : సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు..
కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్ టెక్నాలజీ పనిచేస్తోందని తెలిపారు.
- By Latha Suma Published Date - 06:18 PM, Mon - 3 February 25

Ashwini Vaishnaw : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ ఉందని పేర్కొన్నారు. త్వరలో దేశమంతా సుమారు 100 నమో భారత్ ఎక్స్ ప్రెస్‌లు తీసుకురానున్నామని తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 2026లోపు దేశమంతా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామన్నారు.
రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని చెప్పారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన.. కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉండటంతో జాప్యం జరుగుతోందని అన్నారు. అలాగే, తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని, తాజా బడ్జెట్‌లో అందుకు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ఆటోమేటిక్ రైలు రక్షణ టెక్నాలజీ కవాచ్‌ను అమలు చేస్తామని తెలిపారు. 2026 నాటికి కవాచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని.. రైల్వే భద్రత కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఇండియన్ రైల్వే కోసం 2.52 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు. ఇక రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5337 కోట్లు నిధులు మంజూరు చేశామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్ టెక్నాలజీ పనిచేస్తోందని తెలిపారు.