Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. సైనికుడి మృతి
గురువారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకొన్నారంటూ నిఘా వర్గాలు సమాచారం మేరకు దూదు-బసంత్‌గఢ్ ప్రాంతాంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.
- By Latha Suma Published Date - 12:51 PM, Thu - 24 April 25

Encounter: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఉదమ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. గురువారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకొన్నారంటూ నిఘా వర్గాలు సమాచారం మేరకు దూదు-బసంత్‌గఢ్ ప్రాంతాంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.
Read Also: Encounter : తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
దీంతో తనిఖీలు నిర్వహిస్తున్న వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇరువైపులా భారీగా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈక్రమంలో బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. తూటాలు తగిలి ఓ సైనికుడు గాయపడ్డాడని, మెరుగైన వైద్యం అందినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కాగా, ఏప్రిల్ 22వ తేదీ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పుల్లో 26 మంది మరణించారు. దీంతో కేంద్రం ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
వచ్చే ప్రజలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని భద్రతా విభాగాలను అప్రత్తమం చేశారు. వచ్చే పోయే వారిపై గట్టి నిఘా పెట్టాలని సూచిస్తున్నారు. బస్‌స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా భద్రత పెంచారు. హైదరాబాద్, తిరుపతి, ముంబై, చెన్నై ఇలా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు సాగుతున్నాయి.
మరోవైపు పాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కి రావాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి వేళ.. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఓవైపు చర్యలు తీసుకుంటూనే దేశ భద్రత విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ చర్చలు జరుపుతోంది. భద్రతా విభాగాలు, రా చీఫ్, ఇతర ముఖ్యులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు.