Encounter : బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter : భద్రతా బలగాలు సంయుక్త యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు ముందుగా తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపింది. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
- By Latha Suma Published Date - 12:55 PM, Fri - 8 November 24

Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాల జరిపిన ఎన్‌కౌంటర్‌లో గురువారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరిలో ఒకరు స్థానిక ఉగ్రవాది కాగా మరొకరు విదేశీ ఉగ్రవాది అని తెలిపారు. ఈ మేరకు కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేసారు, “సోపోర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు చంపబడ్డారు. వారి నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిఘా వర్గాల సమాచారం మేరకు గురువారం సాయంత్రం భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బారాముల్లాలోని పానిపోరా సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిర్దిష్ట ఇన్‌పుట్ ఆధారంగా పోలీసులు మరియు భద్రతా బలగాలు సంయుక్త యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు ముందుగా తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపింది. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు చేపట్టిన ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ తర్వాత గురువారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
కాగా, ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు చంపినందుకు నిరసనగా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు . స్థానిక జనాభాలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి హత్యలలో పాల్గొన్న ఉగ్రవాదులను “తక్షణమే నిర్మూలించాలని” నిరసనకారులు డిమాండ్ చేశారు.
జిల్లాలోని ద్రబ్‌షాల్లా ప్రాంతంలో వందలాది మంది గుమిగూడి టైర్లు తగులబెట్టి రోడ్లను దిగ్బంధించారు. పాకిస్థాన్, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ ఉదయం కుంట్వారా మరియు ఇతర ప్రాంతాల్లో నిరసనలు చేశారు.