Shortest Doctor : 3 అడుగుల డాక్టర్.. న్యాయపోరాటంతో ‘వరల్డ్ రికార్డ్’ విజయం
Shortest Doctor : గుజరాత్‌కు చెందిన గణేశ్ బరైయా వయసు 23ఏళ్లు. ఎత్తు 3 అడుగులు మాత్రమే.
- Author : Pasha
Date : 06-03-2024 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
Shortest Doctor : గుజరాత్‌కు చెందిన గణేశ్ బరైయా వయసు 23ఏళ్లు. ఎత్తు 3 అడుగులు మాత్రమే. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)లో 233 మార్కులు సాధించారు. అయితే ఎత్తును కారణంగా చూపించి.. మెడికల్ కాలేజీలో గణేశ్ బరైయాకు సీటు ఇచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అయినా కుంగిపోకుండా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో గణేశ్ బరైయాకు కాలేజీ ప్రిన్సిపల్ దల్పత్ కటారియా సాయం అందించారు.
We’re now on WhatsApp. Click to Join
నీట్‌లో మంచి మార్కులు వచ్చినప్పటికీ.. ఎత్తును సాకుగా చూపించి తనకు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కల్పించ కపోవడాన్ని సవాల్ చేస్తూ గణేశ్ బరైయా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ కటారియా గణేశ్ అందించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం గణేశ్‌కు మెడికల్ కాలేజీలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో గుజరాత్‌లోని భావ్‌నగర్ వైద్య కళాశాలలో గణేశ్ బరైయాకు ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ లభించింది. ప్రస్తుతం ఆయన మెడికల్ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా భావ్‌నగర్ వైద్య కళాశాలలో రోగుల వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్నారు. తాను డెర్మటాలజిస్టు (చర్మ వైద్య నిపుణుడు) కావాలని అనుకుంటున్నానని గణేశ్ అంటున్నారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ టైటిల్‌కు అర్హత సాధించారని భావ్‌నగర్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా వెల్లడించారు.
Also Read : Zuckerberg Bunker : 2వేల కోట్లతో ఫేస్‌బుక్ ఓనర్ రహస్య బంకర్.. విశేషాలివీ
- భావ్‌నగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన గణేశ్ బరైయా(Shortest Doctor).. బరువు 18 కేజీలు.
- ఆయన 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధపడతున్నారు.
- గణేశ్‌కు 8మంది తోబుట్టువులు ఉన్నారు. కానీ వారిలో ఎవరికి ఇలా లేదు.
- విగతా వారితో పోలిస్తే తాను తక్కువ ఎత్తు ఉన్నానని గణేశ్ ఏనాడూ కుంగిపోకుండా చదువుపై దృష్టి పెట్టారు.
- గణేశ్ తోబుట్టువులు 10వ తరగతి వరకే చదువుకున్నారు. వాళ్ల కుటుంబంలో కాలేజీకి వెళ్లి చదివిన మొదటి వ్యక్తిగా గణేశ్ నిలిచారు.