Zuckerberg Bunker : 2వేల కోట్లతో ఫేస్బుక్ ఓనర్ రహస్య బంకర్.. విశేషాలివీ
Zuckerberg Bunker : ప్రపంచ కుబేరులు ఏది చేసినా అంతటా చర్చనీయాంశంగా మారుతుంటుంది.
- By Pasha Published Date - 09:50 AM, Wed - 6 March 24
Zuckerberg Bunker : ప్రపంచ కుబేరులు ఏది చేసినా అంతటా చర్చనీయాంశంగా మారుతుంటుంది. ప్రపంచంలోని టాప్ -10 ధనవంతుల్లో ఒకరైన ఫేస్ బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడో ప్రపంచం యుద్ధం త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆయన హై అలర్ట్ అయ్యారట. అమెరికాలోని హవాయి ద్వీపాల్లోని కవాయి ప్రాంతంలో దాదాపు 1400 ఎకరాల భూమిని 2014 ఆగస్టులోనే మార్క్ జుకర్‌బర్గ్ కొన్నారట. ఆ భూమిలో విలాసవంతమైన ఎస్టేట్.. దానిలోనే రహస్య బంకర్‌ను(Zuckerberg Bunker) ఏర్పాటు చేసుకోవాలనే ప్లాన్‌లో జుకర్‌బర్గ్ ఉన్నారట.
We’re now on WhatsApp. Click to Join
జుకర్‌బర్గ్ రహస్య బంకర్ విశేషాలివీ..
- జుకర్‌బర్గ్ నిర్మించుకోనున్న రహస్య బంకర్ దాదాపు 5వేల చదరపు అడుగుల్లో ఉంటుందట.
- విద్యుత్తు తయారీ, ఆహార తయారీ సదుపాయాలు కూడా ఇందులోనే అంతర్గతంగా ఉంటాయట.
- బంకర్ నిర్మాణానికి దాదాపు రూ.2వేల కోట్లను జుకర్‌బర్గ్ ఖర్చు చేయనున్నారట.
- ఈ బంకర్ నిర్మాణ ప్రాజెక్టు వివరాలు బయటకు రాకుండా జుకర్‌బర్గ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
- ఈ బంకర్ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అనేక మంది సహచరులను.. జుకర్‌బర్గ్ ఉద్యోగం నుంచి తప్పించారట.
- బంకర్ నిర్మాణ వివరాలను బయటకు వెల్లడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఫొటోలు తీసేందుకు కూడా కార్మికులు, ఉద్యోగులు భయపడుతున్నారట.
Also Read : Nicholai Sachdev : వరలక్ష్మీ శరత్‌కుమార్ కాబోయే భర్త నికోలయ్ సచ్దేవ్ ఎవరు ?
- జుకర్‌బర్గ్ రహస్య బంకర్ నిర్మిస్తున్న కవాయి దీవిలో దాదాపు 73వేల మంది నివసిస్తున్నారు.
- స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతాన్ని ‘ది గార్డెన్ ఐల్’గా పిలుస్తారు.
- పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాలను ఇక్కడే తెరకెక్కించారు.
- 2016 సంవత్సరంలో క్రిస్మస్ హాలీడే సందర్భంగా కవాయి ప్రాంతంలో పర్యటించిన మార్క్ జుకర్ బర్గ్ .. కుటుంబంతో దిగిన కొన్ని ఫొటోలను అప్పట్లో ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.
Also Read : Ram Charan Vs Shah Rukh : అంబానీ ఈవెంట్లో రామ్ చరణ్‌కు అవమానం.. ఏం జరిగింది ?
బంకర్ల ప్రధాన లక్ష్యం అదే..
బంకర్ల ఏర్పాటు ప్రధాన లక్ష్యం యుద్ధాలు, విపత్తుల నుంచి రక్షణ పొందడం కోసమే. సింపుల్‌గా చెప్పాలంటే.. భూమిలో (అండర్‌గ్రౌండ్) రహస్యంగా కట్టుకునే గదులు, ఇళ్లనే బంకర్లు అనొచ్చు. నలుగురికి సరిపడే స్థాయి నుంచి.. పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా బంకర్లను కట్టుకుంటుంటారు. అత్యవసర పరిస్థితిలో పనికొచ్చే మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, నీళ్లు, ఆహారం, జనరేటర్లు వంటివాటిని బంకర్లలో సిద్ధంగా ఉంచుకుంటారు.
Related News
Meta CEO Zuckerberg: మెటా సీఈవో జుకర్‌బర్గ్ శాలరీ ఎంతో తెలుసా..? రూ. 100 కంటే తక్కువే..!
మార్క్ జుకర్‌బర్గ్ 2023 సంవత్సరంలో కేవలం 1 డాలర్ (83 రూపాయలు) మాత్రమే ప్రాథమిక వేతనంగా తీసుకున్నాడు. మార్క్ ఈ జీతం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.