CM Mamata : డాక్టర్ హత్యాచార ఘటన..సీఎం మమతా, టీఎంసీ నేతల నిరసన
ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా డిమాండ్ చేస్తున్నారు..
- By Latha Suma Published Date - 05:39 PM, Fri - 16 August 24

Doctor murder incident: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో నిందితులను శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా డిమాండ్ చేస్తున్నారు. హత్యాచారం ఘటనను ఖండిస్తూ కోల్‌కతాలో సీఎం మమతా, టీఎంసీ నేతలు శుక్రవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు.
లైంగికదాడి ఘటన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆదివారంలోగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ పూర్తి చేయాలని ఆమె అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జీ కార్ వైద్యశాలలో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి లైంగికదాడి, హత్య ఘటనతో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ ఘటనకు నిరసనగా గత ఏడు రోజులుగా వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలండూ డిమాండ్ చేస్తున్నారు.