KTR : రేపు రైతులతో కలిసి ధర్నాలు : కేటీఆర్
రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్రా వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపు..
- By Latha Suma Published Date - 02:29 PM, Wed - 21 August 24

KTR: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రేపు రైతుల(Farmers)తో కలిసి ధర్నాలు (dharna) చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులతో, మా పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలు చేస్తామని తెలిపారు. ధర్నాకి వెళ్లే ముందు నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన చిల్లర మాటలకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసనలో కూర్చోండన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒకవేళ విగ్రహం లేకపోతే తెలంగాణ తల్లి ఫ్లెక్సీ అయినా పెట్టి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరండని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్. అటు జన్వాడ ఫాంహౌస్ నాది కానే కాదు…తప్పుంటే కూల్చేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ కూల్చేస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ తనది కాదని.. తన స్నేహితుడిదని వెల్లడించారు.
కాగా, నాకంటూ ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదన్నారు కేటీఆర్. నా మిత్రుడి ఫార్మ్ హౌస్ ను నేను లీజుకు తీసుకున్నాను….ఎఫ్.టి.ఎల్ లో వుంటే నేనే దగ్గర ఉండి ఫార్మ్ హౌస్ ను కూలగొట్టిస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి, నేతలు కె.వి.పి రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ లను కూల్చాలని డిమాండ్ చేశారు.
Read Also: Trai : స్పామ్ కాల్స్, మెసేజ్‌లు చేసే వాళ్ల కనెక్షన్లు పీకేయండి.. ట్రాయ్ ఆదేశాలు