HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Corona Cases Increasing In Three States

Corona Case: అల‌ర్ట్‌.. మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!

భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మే 2025లో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

  • Author : Gopichand Date : 20-05-2025 - 9:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Corona
Corona

Corona Case: భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు (Corona Case) పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మే 2025లో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని, ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని కేంద్రం తెలిపింది.

కేరళలో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మొత్తం 95 కేసులతో 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుల్లో ఒక వ్యక్తి మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 27 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఎక్కువగా స్వల్ప లక్షణాలతో ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

సింగపూర్, హాంకాంగ్‌లలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. కానీ అక్కడి రోగులు 7 రోజుల్లో కోలుకుంటున్నారని, లక్షణాలు బలహీనంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య సంస్థలు తెలిపాయి. భారతదేశంలో వ్యాప్తిలో ఉన్న వైరస్ జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సాధారణ లక్షణాలను కలిగిస్తోంది. ఇవి ప్రమాదకరం కాదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ICMR తదితర సంస్థలు పేర్కొన్నాయి. వైరస్ వ్యాప్తి, లక్షణాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు.

Also Read: Actress Ruchi Gujjar: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా రుచి గుజ్జ‌ర్‌.. మెడ‌లో మోదీ నెక్లెస్‌తో సంద‌డి!

2024లో కేరళలో 66 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇది దేశంలో అత్యధికం. గతంలో కేరళలో 2022లో ఒక రోజులో 49,771 కేసులు, 140 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులు తక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల సంఖ్యను పెంచాలని, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించింది. ప్రజలు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Corona Case
  • corona cases
  • covid-19
  • kerala
  • Maharashtra
  • tamilnadu

Related News

Jana Nayagan vs Parasakthi Release

జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు

Jana Nayagan Vs Parasakthi  తమిళనాడులో ఈసారి పొంగల్‌కు సినిమాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలు కూడా బాగా హాట్ హాట్‌గా మారనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాకు పోటీగా.. డీఎంకేతో సంబంధం ఉన్న పరాశక్తి సినిమాలు.. ఇప్పుడు పొంగల్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు సక్సెస్, కలెక్షన్ల గురించి మాత్రమే కాకుండా.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముడిపడి ఉండటంతో.. స

  • Shirdi Sai Baba

    కాసుల వర్షం.. కొత్త ఏడాది కానుకగా రూ. 23.29 కోట్ల విరాళాలు!

Latest News

  • ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?

  • భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?

  • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

  • టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

  • అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd