CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణపై వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్..ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు.
- By Latha Suma Published Date - 04:12 PM, Wed - 9 October 24

SC Classification : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
Read Also: CM Revanth Reddy : ఆదివాసి సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఇక.. 24గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీలతో సచివాలయంలో భేటి అయ్యారు. ఈ సమావేశానికి ఆయా సబ్ కమిటీల సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుకు న్యాయ పరమైన చిక్కులు రాకుండా జ్యూడీషియల్ కమిటీ వేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ అంశంతో పాటు కమిటీకి ప్రజా సంఘాల నుంచి వచ్చిన 1082అభిప్రాయాలు, జిల్లాల పర్యటన అంశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల పర్యటన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే బీసీ కుల గణనలో ఎలా ముందుకెళ్ళాలన్నదానిపై సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు.