HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >China Will Benefit More From This Scheme Than India Rahul Gandhi

Rahul Gandhi : ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం: రాహుల్ గాంధీ

ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ, అక్కడి టెక్నీషియన్లతో చర్చించారు. ఆ సంభాషణతో కూడిన వీడియోను ఆయన తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎక్కడో తప్పుగెళ్లాయని, యువత నిరుద్యోగంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Author : Latha Suma Date : 21-06-2025 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China will benefit more from this scheme than India: Rahul Gandhi
China will benefit more from this scheme than India: Rahul Gandhi

Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయిందని, వాస్తవానికి చైనా దేశానికే ఎక్కువ లాభాలు చేకూరేలా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ, అక్కడి టెక్నీషియన్లతో చర్చించారు. ఆ సంభాషణతో కూడిన వీడియోను ఆయన తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎక్కడో తప్పుగెళ్లాయని, యువత నిరుద్యోగంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Kaushik Reddy : ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరలింపు

మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగం విస్తరిస్తుందని కేంద్రం చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే, తయారీ రంగం క్షీణించి, చైనాలో తయారయ్యే వస్తువుల దిగుమతులు రెట్టింపు అయ్యాయి. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాకపోతే మరేమిటి? అని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని మోడీపై తీవ్రంగా విమర్శలు చేసిన రాహుల్, ఆయన నాయకత్వంలో నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని, కానీ ప్రజలకు ఉపయోగపడే పరిష్కారాలు మాత్రం మిస్ అవుతున్నాయన్నారు. 2014లో తయారీ రంగం జీడీపీలో 17 శాతం ఉండగా, ఇప్పుడు అది 14 శాతానికి పడిపోయింది. మనం అసెంబ్లింగ్ పనులకే పరిమితమయ్యాం. పూర్తి స్థాయిలో తయారీ భారత్‌లో జరగడం లేదు. దీనివల్ల ఆర్థిక లాభాలు చైనా దేశానికి వెళ్తున్నాయి అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను కూడా కేంద్రం తగ్గించుతోందని విమర్శించిన రాహుల్, దేశ తయారీ రంగం బలోపేతానికి సమగ్ర సంస్కరణలు అవసరమని అన్నారు. భారతదేశం కేవలం మార్కెట్‌గా కాక, ఉత్పత్తిదారుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి. దేశీయ పరిశ్రమలకు తగిన మద్దతు ఇవ్వాలి. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. మన వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకోవాలని, దేశ ఆర్థిక స్వావలంబన కోసం నిజమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు.

Read Also: Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్‌ల సీఎం నీతీశ్ కుమార్‌ పై కీలక నిర్ణయం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • indian economy
  • Make In India
  • manufacturing sector
  • rahul gandhi
  • unemployment

Related News

Donald Trump holds call with Xi Jinping

గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు

CHINA vs USA  ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు ని

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Latest News

  • Peddi : విడుదల కు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న పెద్ది

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd