Canada : అమెరికా వాహనాలపై 25శాతం సుంకాలను విధించిన కెనడా
కెనడా-యునైటెడ్‌స్టేట్స్-మెక్సికో ఒప్పందం పరిధిలోకి రాని వాహనాలన్నింటిపై ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ ఈ వాణిజ్య సంక్షోభానికి కారకులు అన్నారు.
- By Latha Suma Published Date - 12:11 PM, Wed - 9 April 25

Canada : వాషింగ్టన్ విధించిన సుంకాలకు ప్రతిగా అమెరికా వాహనాలపై కెనడా 25శాతం సుంకాలను విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని మార్క్ కార్ని ట్విటర్‌లో ప్రకటించారు. కెనడా కేవలం ఓ లక్ష్యం కోసం శక్తిమంతంగా స్పందించింది అని వెల్లడించారు. కెనడా-యునైటెడ్‌స్టేట్స్-మెక్సికో ఒప్పందం పరిధిలోకి రాని వాహనాలన్నింటిపై ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ ఈ వాణిజ్య సంక్షోభానికి కారకులు అన్నారు.
Read Also: TDP : వర్మకు చంద్రబాబు బంపర్ ఆఫర్..?
కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ మాట్లాడుతూ..కెనడా ఉద్యోగులు, వాణిజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అకారణంగా అమెరికా విధించిన సుంకాలపై కెనడా శక్తిమేరకు స్పందిస్తూనే ఉంటుందని అని పేర్కొన్నారు. కాగా, మార్చి 4వ తేదీన కెనడా వస్తువుల దిగుమతిపై ట్రంప్ 25శాతం, ఇంధనం, పొటాష్‌పై 10శాతం టారిఫ్‌ను ట్రంప్ విధించారు. ఆ తర్వాత సీయూఎస్‌ఎంఏ పరిధిలోకి రాని వాటికి మాత్రమే దీనిని పరిమితం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు టారిఫ్‌ల విధింపుతో ఇవి తార స్థాయికి చేరాయి. మార్చి 12న కెనడా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించారు. ఏప్రిల్ 3వ తేదీన కెనడా నుంచి దిగుమతి అయ్యే వాహనాలపై, మే 3 నుంచి విడిభాగాలపై 25శాతం చొప్పున పన్ను వేశారు. కెనడా కూడా వీటిని తగినట్లు స్పందిస్తూ అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు విధించింది.
అమెరికా సుంకాల దెబ్బకు చాలా దేశాలు ఒప్పందం కోసం తహతహలాడుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఏ దేశాల ప్రతినిధులు తనకు కాల్ చేశారో మాత్రం వెల్లడించలేదు. వాణిజ్య ఒప్పందాల కోసం వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణకొరియా దేశాధినేతలు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: China : నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి