Kishan Reddy : బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: కిషన్‌రెడ్డి
మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
- By Latha Suma Published Date - 04:35 PM, Thu - 1 May 25

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
Read Also: CM Revanth Team: సీఎం రేవంత్ టీమ్‌లో మార్పులు.. సన్నిహితులకు కీలక బాధ్యతలు
కులగణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకొంటోంది. 2011 జనగణనలో కులగణన చేర్చాలని సుష్మాస్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాశారు. దేశంలో కులగణన జరిగితే బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సామాజిక వర్గం వెనకబడి ఉందో గుర్తించవచ్చు. వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు ఉపయోగపడుతుంది. కాంగ్రెస్‌లా.. ముస్లింలను బీసీల జనాభాలో చేర్చి మోసం చేయం. తెలంగాణ, కర్ణాటకలో కులగణనను కాంగ్రెస్ తూతూమంత్రంగా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిజమైన కులగణన కాదు అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అలాంటప్పుడు కాంగ్రెస్ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదు. ఇది రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డికి భయపడి తీసుకున్న నిర్ణయం కాదు. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నందున కులగణన నిర్ణయం తీసుకున్నాం అని కిషన్‌రెడ్డి అన్నారు.