HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Modi To Ap Tomorrow This Is The Full Schedule

Amaravati Relaunch : రేపు ఏపీకి మోడీ..పూర్తి షెడ్యూల్ ఇదే !

Amaravati Relaunch : ఈ కార్యక్రమానికి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు, రైతులను ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించారు.

  • Author : Sudheer Date : 01-05-2025 - 3:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Tour
Modi Tour

రాజధాని అమరావతి పునఃప్రారంభం (Amaravati Relaunch) కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ (Modi) మే 2న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికార వర్గాలు విడుదల చేశాయి. రేపు మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం సమీపంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు,

Pahalgam Attack : 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఇంకా ఇండియా లోనే ఉన్నారా..?

3:30 గంటలకు అమరావతి పునఃప్రారంభ సభాస్థలికి చేరుకుని ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణాలకు కేంద్రం, రాష్ట్రం కలసి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర కేంద్ర ప్రాజెక్టులకూ శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా మోదీ చేయనున్నారు. సభలో ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 4:55 గంటలకు మళ్లీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఢిల్లీ బయలుదేరతారు.

May Day : జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారింది: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఈ సభ విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సచివాలయం వెనక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్కింగ్, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు, రైతులను ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించారు. సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. రవాణా సౌకర్యానికి 8,000 బస్సులు రాజధాని ప్రాంత ప్రజల కోసం, 6,000కి పైగా బస్సులు చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం సిద్ధం చేశారు. ఈ సభ ద్వారా అమరావతి అభివృద్ధికి కొత్త శకం ప్రారంభమవుతుందని అధికార పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati Relaunch
  • ap
  • modi
  • modi tour

Related News

Vip Break Darshan For 116 Y

TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

ఆమె భక్తి పట్ల స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd