Balayya Rajini Multi Starrer : బాలయ్య, రజినీ, శివరాజ్ మల్టీస్టారర్ ?
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కలిసి మల్టీ స్టారర్ మూవీతో (Balayya Rajini Multi Starrer) ముందుకు రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
- Author : Pasha
Date : 22-05-2023 - 12:33 IST
Published By : Hashtagu Telugu Desk
ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. చాలామంది పెద్ద హీరోలు బేషజాలకు పోకుండా కలిసిమెలిసి మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే చాలు .. కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే చాలా మల్టీస్టారర్స్ ఆడియన్స్ ను అలరించాయి. ఈ కోవలోనే మరో మల్టీ స్టారర్ కోసం ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కలిసి మల్టీ స్టారర్ మూవీతో (Balayya Rajini Multi Starrer) ముందుకు రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి కోసం KGF తరహా స్టోరీ రెడీ అవుతోందని అంటున్నారు. ఈ మూవీకి ప్రముఖ కన్నడ డైరెక్టర్ తెరకెక్కిస్తారనే చర్చ జరుగుతోంది.
రజినీకాంత్ 171వ ఫిల్మ్ గా..
ఈ మల్టీ స్టారర్ మూవీ రజినీకాంత్ 171వ ఫిల్మ్ అవుతుందని చెబుతున్నారు. ఈ మల్టీస్టారర్ రెండు భాగాలుగా విడుదల కానుందనే డిస్కషన్ జరుగుతోంది. మొదటి పార్ట్ లో (Balayya Rajini Multi Starrer) బాలకృష్ణ, రజినీకాంత్ హీరోలుగా నటిస్తారట. సెకండ్ పార్ట్ లో బాలకృష్ణ, శివరాజ్ కుమార్ నటిస్తారట. ఇది ఐదు భాషల్లో విడుదల కానుందట. ప్రస్తుతానికి రజినీకాంత్, బాలయ్య వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటి పనులు పూర్తయిన తర్వాతే.. మల్టీస్టారర్ మూవీ పై చర్చించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
also read : Jr. NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ మూవీ..?
శివరాజ్ కుమార్ ప్రకటన అదే ?
మే 20న హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరైన శివరాజ్ కుమార్… బాలయ్య, నేను బ్రదర్స్ లాంటి వాళ్ళమని చెప్పారు. త్వరలో బాలకృష్ణ, నేను కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నామని వెల్లడించారు. దీంతో మల్టీ స్టారర్ మూవీయే అనే చర్చ మొదలైంది. బాలయ్య మూవీ “గౌతమి పుత్ర శాతకర్ణి” తో శివరాజ్ కుమార్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.
బాలయ్య 108వ మూవీ..
బాలయ్య బాబుకు “అఖండ” మూవీ రూపంలో భారీ బ్రేక్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్యకు అఖండ మరో జన్మనిచ్చింది. వీరసింహారెడ్డితో సక్సెస్ ట్రాక్ కొనసాగించిన బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ మూవీ చేస్తున్నారు.