Aprilia Tuono 457 : తిరుపతిలో అందుబాటులోకి వచ్చిన అప్రిలియా టుయోనో 457
బుకింగ్‌లు ఇప్పుడు WWW.SHOP.APRILIAINDIA.COM ద్వారా తెరవబడ్డాయి. రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
- Author : Latha Suma
Date : 18-04-2025 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
Aprilia Tuono 457 : కొత్త అప్రిలియా టుయోనో ను తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. తిరుపతి లోని నికిమోటార్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అప్రీలియా టుయోనో 457 మరియు వెస్పా కాలా టెక్ లను తిరుపతి జిల్లా రవాణా అధికారి మురళీ మోహన్ విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పియాజియో రీజినల్ మేనేజర్ క్రాంతి కుమార్ మరియు డీలర్ నాగభూషణ రెడ్డి గారు పాల్గొన్నారు.
డొమెస్టిక్ 2W బిజినెస్ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘువంశి మాట్లాడుతూ .. “ విభాగంలో సంచలనాలను సృష్టించిన అప్రిలియా RS457 ను మేము విడుదల చేసిన ఒక సంవత్సరం తర్వాత, తిరుపతిలో అప్రిలియా టుయోనో 457 ను విడుదల చేయటం పట్ల సంతోషంగా ఉన్నాము. మా అప్రిలియా స్కూటర్లు మరియు మోటర్‌సైకిళ్లకు తిరుపతి లో లభించిన స్పందనలాగానే టుయోనో 457 తిరుపతిలో బైకర్ల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము” అని అన్నారు.