Apple : ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ వార్నింగ్..
- By Latha Suma Published Date - 02:53 PM, Thu - 11 April 24

Apple: యాపిల్ సంస్థ(Apple) తమ ఫోన్లు వాడుతున్న వారికి తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు(users) ఆ హెచ్చరిక వెళ్లింది. మెర్సినరీ స్పైవేర్(Mercenary spyware)తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్నింగ్ నోటిఫికేషన్‌లో యాపిల్ సంస్థ వెల్లడించింది. మీరు మెర్సినరీ స్పైవేర్ బాధితులు అయి ఉంటారని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు అటాకర్లు ప్రయత్నించి ఉంటారని ఆ వార్నింగ్‌లో తెలిపారు. ఈ మెయిల్ ద్వారా ఆ నోటిఫికేషన్ పంపారు. యాపిల్ సంస్థ తన ప్రకనటలో పెగాసస్ స్పైవేర్ గురించి కూడా ప్రస్తావించింది.
We’re now on WhatsApp. Click to Join.
విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్న ఇండియాలో ఆ స్పైవేర్ గురించి 2021లో పెను దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. మెర్సినరీ స్పైవేర్ దాడులకు గురైన వ్యక్తులు కానీ యూజర్లు కానీ తమ నోటిఫికేషన్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు అని యాపిల్ సంస్థ తన స్టేట్మెంట్‌లో తెలిపింది. మెర్సీనరీ స్పైవేర్ వల్ల మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని, ఆ స్పైవేర్‌కు చాలా షార్ట్ లైఫ్ ఉంటుందని, ఆ స్పైవేర్‌ను డిటెక్ట్ చేసి, అడ్డుకోవడం అంత సులువైన విషయం కాదు అని యాపిల్ సంస్థ తన ప్రకటనలో చెప్పింది. కానీ ఎక్కువ శాతం యూజర్లను మాత్రం ఆ స్పైవేర్‌తో టార్గెట్ చేయరని వెల్లడించింది.
Read Also: Delhi Excise Policy Case: కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
ప్రభుత్వాలు, పెగాసిస్ లాంటి స్పైవేర్‌ను డెవలప్ చేస్తున్న సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు యాపిల్ తన వార్నింగ్‌లో తెలిపింది.