HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Movie Reviews
  • >Suhas Hey Balwant Movie Review

సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ

  • Author : Vamsi Chowdary Korata Date : 20-02-2026 - 11:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hey Balwanth Movie Review
Hey Balwanth Movie Review

Suhas  రిలీజ్‌కి నాలుగు రోజుల ముందు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంతో ‘హే భగవాన్’ సినిమా కాస్తా ‘హే బలవంత్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ అన్నీ సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అసలు హీరో తండ్రి (వీకే నరేష్) ఏం బిజినెస్ చేస్తున్నాడబ్బా అనే ప్రశ్న టీజర్, ట్రైలర్‌లో బాగా హైలెట్ అయింది. ఇక దాన్ని ఎక్కడా రివీల్ కూడా చేయకుండా డైరెక్ట్‌గా థియేటర్లోనే ఆడియన్స్‌ చూసి తెలుసుకోవాలన్నారు.

ఇక సుహాస్ కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్‌లో హే బలవంత్ చిత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇక బ్రేకుల్లేని బండిలా సీనియర్ నటుడు నరేష్ వరుసగా తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నరేష్ ఉండటం కూడా సినిమాకి బాగా హైప్ తెచ్చింది. మరి అనుకున్నట్లుగా సినిమా నవ్వులు పూయించిందా? ఇంతకీ నరేష్ సినిమాలో చేసిన బిజెనెస్ ఏంటి.. ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

బిజినెస్ అంటే అదే మరి
కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కృష్ణ (సుహస్)కి తన తండ్రి రావ్ బలవంత్ (నరేష్) చేసే బిజినెస్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అసలు ఏ బిజినెస్ చేస్తున్నాడో తెలియకపోయినా ఎలాగైనా పెద్దయ్యాక తన తండ్రి వ్యాపారాన్ని తాను టేకప్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ బలవంత్ మాత్రం తన కొడుకుని ఎక్కడో సిటీకి పంపించి చదివిస్తాడు. అయితే కృష్ణకి మాత్రం తన తండ్రి వ్యాపారానికి వారసుడిగా ఉండాలనే కోరిక మాత్రం చావదు.

ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా తన తండ్రి ఎందుకు తనని బిజినెస్‌లోకి రానివ్వడం లేదన్నది కృష్ణకి అర్థం కాదు. అయితే సడెన్‌గా ఒకరోజు బలవంత్‌కి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో చేరతాడు. బిజినెస్ టెన్షన్ వల్లే మీ తండ్రికి ఇలా అయిందని డాక్టర్ చెప్పడంతో ఇక వ్యాపారం తాను చూసుకునే టైమ్ వచ్చేసిందని కృష్ణ డిసైడ్ అయిపోతాడు. సూటు బూటు వేసుకొని రెడీ అయి తండ్రి చేసే బిజినెస్‌కి సంబంధించిన ఆఫీసుకి వెళ్లిన కృష్ణ అక్కడ జరిగేది బిజినెస్ కాదు చీకటి యాపారం అని చూసి అవాక్కవుతాడు.

మరి ఈ విషయం తెలుసుకున్న తర్వాత కృష్ణ పరిస్థితేంటి..? అసలు బలవంత్ ఇలాంటి వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు..? కృష్ణ.. తాను ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నగరం)కి ఈ విషయం చెప్పాక ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

సెన్సిటివ్ సబ్జెక్ట్ కానీ
నిజానికి ఈ కథని చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ మీద రాసుకున్నారు డైరెక్టర్. అయితే కథ ఎంత సెన్సిబుల్ అయినా కూడా అందులోనుంచి అంతే స్థాయిలో కామెడీని కూడా జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, కొన్ని అడల్ట్ రేటెడ్ కామెడీ పంచులు కూడా ఉంటాయ్.. అయితే ఈ సినిమాకి సెన్సార్ ఇచ్చింది కూడా A సర్టిఫికేట్ అన్న సంగతి తెలిసిందే. కనుక పెద్దవాళ్లని ఇబ్బంది పెట్టేంత తక్కువ స్థాయి కామెడీ ఏం సినిమాలో లేదు. సినిమా ఆద్యంతం కామెడీ ట్రాక్స్ అన్నీ పండాయి.

ఫస్టాఫ్ మొత్తం సుహాస్‌కి తన ఫ్రెండ్ పాత్ర చేసిన కమెడియన్ సుదర్శన్ మధ్య జరిగిన సీన్లు థియేటర్లో గట్టిగానే నవ్వించాయి. ఫస్టాఫ్ పెద్దగా కామెడీ జోలికి వెళ్లకపోయినా సెకండాఫ్‌లో మాత్రం నరేష్ తనదైన టైమింగ్, నటనతో ఆడియన్స్‌ని నవ్వించారు.. అలానే కొన్ని సీన్లలో ఎమోషనల్ కూడా చేశారు. అయితే హీరోకి, తండ్రికి మధ్య సాగిన ఫాదర్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది కానీ సినిమా కథలో కోర్ పాయింట్ అయిన బలవంత్ బిజినెస్ మీద రాసుకున్న ట్రాక్ మాత్రం అంతగా ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వకపోవచ్చు.

నిజానికి అసలు ఎందుకు వీళ్లు అలాంటి చీకటి వ్యాపారంలోకి దిగారు అనేది డైరెక్టర్ కన్వినియంట్‌గా చెప్పలేకపోయారు. అది కన్వినియంట్‌గా చెప్పినట్లు కనిపించినా కూడా ఆడియన్స్‌‌కి కనెక్ట్ కాకపోవచ్చు. యాంకర్ స్రవంతి చొక్కరపు ఇందులో చంపకమాల అనే పాత్రలో నటించింది. అభినయం పరంగా స్రవంతి బాగానే చేసింది కానీ డబ్బింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎందుకంటే డైలాగ్ డెలివరీ నేచురల్‌గా అనిపించలేదు. పట్టిపట్టి చెప్పినట్లుగా ఉంది.

కామెడీ విషయంలో మాత్రం అందరూ నవ్వులు పూయించారు. సుదర్శన్ కనిపించిన ప్రతి సీనులోని ఫన్ జనరేట్ చేయగలిగాడు. అలానే బాబు మోహన్ చాన్నాళ్ల తర్వాత కాస్త ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించారు (వినిపించలేదు అది వేరే సంగతి అనుకోండి). అలానే హర్షవర్థన్, సీనియర్ నటి అన్నపూర్ణ, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ ఇలా అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.

సినిమాలో నరేష్ పాత్ర మాత్రం చాలా కీలకం. కొడుకు ముందు ఫెయిలైన ఒక తండ్రిగా నరేష్ తన నటనతో ఏడిపించారు. అలానే కమెడియన్‌గా చాలా సీన్లలో నవ్వించారు కూడా. ఇక సుహాస్ కూడా తనకి బాగా అలవాటైన పక్కింటి కుర్రాడి పాత్రలో చాలా సింపుల్‌గా కనిపించాడు. అలానే ఎమోషనల్ సీన్లలో కూడా యాక్టింగ్ ఇరగదీశాడు. లిటిల్ హార్ట్స్ సినిమాతో భారీ హిట్ కొట్టిన శివానీ నగరం ఈ చిత్రంలో కూడా క్యూట్‌గా కనిపించింది. కామెడీ సీన్లలో కూడా బాగానే నవ్వించింది.

వివేక్ సాగర్ అందించిన సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బీజీఎమ్ విషయంలో మాత్రం న్యాయం చేశారు. ఓవరాల్‌గా సినిమా అయితే ఎక్కడా నిరాశపరచలేదు. కానీ హీరో తండ్రి ఇలాంటి కాలంలో కూడా సమాజం ఒప్పుకోలేని ఒక వ్యాపారాన్ని ఎందుకు కొనసాగించాడనే ప్రశ్న మాత్రం ఆడియన్స్‌లో మిగిలిపోతుంది. దీనికి డైరెక్టర్ ఆన్సర్ ఇచ్చారు కానీ ఆడియన్స్ దానికి పూర్తిగా కనిన్స్ కాలేకపోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో నరేష్, అన్నపూర్ణ పాత్రలకి సంబంధించి ఇచ్చిన చిన్న ట్విస్ట్ మాత్రం బావుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hero Suhas
  • Hey Balwanth
  • Movie Review And Rating
  • Shivani Nagaram
  • Suhas
  • Suhas Hey Balwanth
  • Suhas Movie
  • tollywood

Related News

Allu Arjun's 'Raka' – When is the release date?

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు నె

    Latest News

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd