Ap Eapcet Key : ఈఏపీసెట్ కీ రిలీజ్.. డౌన్ లోడ్ ఇలా
ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ కీ (Ap Eapcet Key) రిలీజ్ అయింది.
- By Pasha Published Date - 10:42 AM, Wed - 24 May 23
ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ కీ (Ap Eapcet Key) రిలీజ్ అయింది. మంగళవారం రోజే ముగిసిన ఈ ఎగ్జామ్ కీ (Ap Eapcet Key)ని వెంటనే ఇవాళ (బుధవారం) విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. దీనిపై అభ్యంతరాలు ఉంటే.. ఈనెల 26న ఉదయం 9 గంటలలోపు తెలియజేయాలని ఈఏపీసెట్ ఛైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు కోరారు.
also read : Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్
అభ్యంతరాల స్వీకరణ విండో ఈ రోజు ఉదయం 9:00 నుంచి మే 26 , ఉదయం 9:00 గంటల వరకు తెరిచి ఉంటుందన్నారు. చెల్లుబాటు అయ్యే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత, తుది సమాధాన కీ విడుదల చేస్తామన్నారు. ఈఏపీసెట్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/లో కీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. వెబ్సైట్ హోమ్‌పేజీలో “సమాధానం కీ” లేదా “డౌన్లోడ్ ఆన్సర్ కీ” విభాగాన్ని చూడొచ్చు. దానిపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈఏపీసెట్ ద్వారా ప్రవేశాల కోసం ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Related News
AP : ఏపి పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల
AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. We’re now on WhatsApp. Click to Join. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర […]