HMPV : భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు
చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు బాలికను హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది.
- By Latha Suma Published Date - 01:55 PM, Mon - 13 January 25

HMPV : భారత్‌లో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరోచిన్నారి ఈ వైరస్ బారిన పడింది. పుదుచ్ఛేరికి చెందిన చిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో HMPV పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరింది. పుదుచ్చేరిలో ఓ బాలిక కొన్ని రోజుల కిందట జ్వరం, దగ్గు, జలుబు సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు బాలికను హాస్పిటల్ లో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. పుదుచ్చేరిలో నమోదైన రెండో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసు ఇది. ప్రస్తుతం చిన్నారి వైద్య చికిత్సకు సహకరిస్తోందని చెప్పారు.
గతవారం మూడేండ్ల చిన్నారి ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యింది. పుదుచ్చేరిలో తాజాగా నమోదైన కేసుతో కలిపితే దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది. గరిష్టంగా గుజరాత్‌లో 5 కేసులు, మహారాష్ట్ర, కోల్‌కతాలో మూడు చొప్పున, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు చొప్పున, అస్సాంలో ఒక హెచ్ఎంపీవి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాలోనూ చిన్నారులు, వృద్ధుల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అతి చిన్న వయసు కలిగిన చిన్నారులలో వైరస్ ప్రవేశిస్తుంది. దాంతో దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలున్న కొందరు చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా ఏదో చోట హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
కాగా, లక్షలాది మంది ప్రాణాలు తీసిన కోరనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో ఇటీవలే హ్యుమన్ మోటాన్యుమోవైరస్ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప్రజలను పీడిస్తున్న ఈ హ్యుమన్ మోటాన్యుమోవైరస్ క్రమక్రమంగా భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ ఇది సాధారణ వైరస్ అని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు వివరిస్తున్నారు.
Read Also: Kite Festival : కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి