KTR: సీఎం రేవంత్‌రెడ్డికి ఆల్ ది బెస్ట్..కేటీఆర్ ట్వీట్
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన వ్యవస్థను రూపొందించామన్న కేటీఆర్..
- Author : Latha Suma
Date : 04-08-2024 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
KTR: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ రాష్ట్రానికి(Telangana state) పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు నా శుభాకాంక్షలు.. ఆల్ ది బెస్ట్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి విదేశాల్లోని ప్రముఖ కంపెనీలతో వారు పెంచుకున్న సంబంధాలు ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేస్తున్నాయి. అలుపన్నది లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చాం.
వాటిని చూస్తుంటే నేడు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు(Investments) రావడం సంతోషకరమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాధాన్యం ఇచ్చాం అని కేటీఆర్ అన్నారు. టీఎస్-ఐపాస్‌లో ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలకు ఆకర్షితులై అనేక కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. గత దశాబ్దంలో ప్రయివేటు రంగంలో రూ.4 లక్షల కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాం. రాజకీయాలు పక్కన పెడితే నాకు, బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణే ముందు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి, తాము ఏర్పాటు చేసిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విజయం సాధిస్తుందని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.. జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.