AI Drone Killed Operator : సైనికుడిపైకి తిరగబడ్డ ఏఐ డ్రోన్.. ఎక్కడంటే ?
AI Drone Killed Operator : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(AI).. ఆయుధ రంగంలోకి కూడా ఎంటర్ అయింది.ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ సహా ఎన్నో దేశాలు AI టెక్నాలజీ తో డ్రోన్లను, యుద్ధ విమానాలను ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇదే అంశంపై మే 23, 24 తేదీల్లో లండన్ లో జరిగిన సదస్సులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన గురించి వెలుగులోకి వచ్చింది.
- By Pasha Published Date - 09:15 AM, Fri - 2 June 23
AI Drone Killed Operator : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(AI).. ఆయుధ రంగంలోకి కూడా ఎంటర్ అయింది.
ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ సహా ఎన్నో దేశాలు AI టెక్నాలజీ తో డ్రోన్లను, యుద్ధ విమానాలను ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై ప్రయోగాలు చేస్తున్నాయి.
ఇదే అంశంపై మే 23, 24 తేదీల్లో లండన్ లో జరిగిన సదస్సులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన గురించి వెలుగులోకి వచ్చింది.
అమెరికా ఎయిర్ ఫోర్స్ కల్నల్ టక్కర్ సిన్కో హామిల్టన్ ఒక కీలకమైన అంశాన్ని ఆ సదస్సు సందర్భంగా వెల్లడించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(AI) యొక్క చీకటి కోణాన్ని ఆయన తన మాటల్లో ఆవిష్కరించారు. అందరూ నివ్వెరపోయే ఒక షాకింగ్ ఘటన గురించి వివరించారు. అదేమిటంటే.. “మేం AI నియంత్రిత డ్రోన్ ఒకదాన్ని కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా పరీక్షిస్తున్నాం.. అప్పటిదాకా అది మా కంట్రోల్ లోనే ఉంది. AI టెక్నాలజీని వాడుకొని అది పరిసరాల సమాచారాన్ని, శత్రువుల సమాచారాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుంటోంది. మేం తాపీగా కూర్చొని AI నియంత్రిత డ్రోన్ కదలికలను ఆసక్తిగా చూస్తున్నాం.
Also read : Sudan War – Pepsi Cola : పెప్సీ, కోలాలపై సూడాన్ యుద్ధం ఎఫెక్ట్
శత్రువు ఎయిర్ డిఫెన్స్ మిషన్‌ను అణచివేసే సమయంలో ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను ప్రయోగించే సైట్‌లను దెబ్బతీయాలి. ఆ మిషన్ ను AI నియంత్రిత డ్రోన్ కు అప్పగించాం. ఈక్రమంలో దాన్నిగ్రౌండ్ నుంచి ఆపరేట్ చేసే సైనికుడి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేలా AI డ్రోన్ లో సెట్టింగ్స్ ఉన్నాయి. కానీ పదేపదే ఆదేశాలను ఇస్తున్న ఆపరేటర్ పై అకస్మాత్తుగా ఆ డ్రోన్ తిరగబడింది. వెనక్కి తిరిగి ఆపరేటర్ పైకి(AI Drone Killed Operator) దూసుకొచ్చి ఢీకొట్టింది. ఇది చూసి మేం నోరెళ్లబెట్టాం” అని అమెరికా ఎయిర్ ఫోర్స్ కల్నల్ టక్కర్ సిన్కో హామిల్టన్ వివరించారు.