HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >6 2 Magnitude Earthquake Hits Turkey

Earthquake : టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం

ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది.

  • Author : Latha Suma Date : 23-04-2025 - 6:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
6.2 magnitude earthquake hits Turkey
6.2 magnitude earthquake hits Turkey

Earthquake:  టర్కీలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల సమయంలో భూకంపం వచ్చిందని.. తీవ్రత ఎక్కువగా ఉందని ఆ దేశ విపత్తు సంస్థ పేర్కొంది. ఈ ప్రకంపనలు దేశ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ స్పష్టంగా వచ్చినట్లు తుర్కియే ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.

Read Also: Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ

ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంప ప్రభావం తుర్కియేతో పాటు బల్గేరియా, గ్రీస్, రొమేనియా వంటి సమీప దేశాల్లోనూ నమోదైందని అధికారులు స్పష్టం చేశారు.

కాగా, 2023 ఫిబ్రవరిలో ఆ దేశంలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ విలయంలో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోనూ ప్రకంపనలు రావడంతో 6వేల మంది చనిపోయారు. ఇక, ఇటీవల మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాన్ని మరువక ముందే తాజాగా మళ్లీ భూ ప్రకంపనలతో టర్కీ ప్రజలు వణికిపోతున్నారు.

Read Also: Samantha 2nd Wedding : సమంత పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 6.2 Magnitude Earthquake
  • A disaster organization
  • earthquake
  • Istanbul
  • Turkey

Related News

Earthquake

Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ మళ్లీ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. గంటల వ్యవధిలోనే దేశంలో భూకంపం రావడం ఇది రెండోసారి. నిన్న సాయంత్రం కూడా 5.3 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. భారత, యురేషియా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండటంతో పాకిస్థా

  • PM Modi extends massive support to earthquake-hit Venezuela; India ready to provide assistance.

    Venezuela Earthquake: భూకంపాల్లో దెబ్బతిన్న వెనిజులాకు ప్రధాని మోదీ భారీ మద్దతు.. సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి

Latest News

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd