Telangana : త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ: సజ్జనార్
కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:30 AM, Tue - 15 April 25

Telangana : తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సంస్థలో 3038 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. కొత్త పోస్టుల భర్తతో ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఉద్యోగులు కార్మికులపై పనిభారం తగ్గుతుందన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్‌టీసీ కళాభవన్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
Read Also: Petrol Diesel Prices: తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా?
కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యాజమాన్యం పరిశీలిస్తోందని, కొందరు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఉద్యోగులకు సూచించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రాజశేఖర్, మునిశేఖర్, ఖుస్రోషా ఖాన్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్లు ఉషాదేవి, నర్మద, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్నారు.
Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు.. ఏ విషయంలో అంటే?