Rahul Gandhi : రాహుల్ గాంధీపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
3 FIRs registered against Rahul Gandhi: ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద నిరసన కూడా చేపట్టారు. బీజేపీ నేతలు అయితే విదేశాల వేదికగా భారత్ పై, సిక్కులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
- By Latha Suma Published Date - 02:27 PM, Sat - 21 September 24

3 FIRs registered against Rahul Gandhi: అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఈ నెల 9న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద నిరసన కూడా చేపట్టారు. బీజేపీ నేతలు అయితే విదేశాల వేదికగా భారత్ పై, సిక్కులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే రాహుల్ తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్ జిల్లాల్లో బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని భారత న్యాయ సంహిత సెక్షన్ 299, సెక్షన్ 302ల ప్రకారం పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు.
Read Also: Tirumala Laddu Controversy : పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్..ప్రకాష్ కు విష్ణు కౌంటర్
ఇటీవల అమెరికాలో పర్యటించారు రాహుల్ గాంధీ. ఈ పర్యటనలో భాగంగా జార్జ్‌టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించారు. అయితే.. భారత్ అభివృద్ధి, రిజర్వేషన్లపై విద్యార్థులు రాహుల్ గాంధీని అడగగా.. ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు రావడంకోసం రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రిజర్వేషన్ల వల్ల కొందరికి లాభం చేకూరగా.. మరికొంత మందికి నష్టం చేకూరుస్తుందని అన్నారు. కాగా లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి అదిఆకారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై మాట్లాడడంపై బీజేపీ విమర్శల దాడికి దిగింది.
రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నశిస్తుంది కానీ రిజర్వేషన్ నశించదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ పిల్లతనం వదిలేయాలని హితవు పలికారు. దేశం బయటకు వెళ్లి దేశాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం రిజర్వేషన్‌ను అంతం చేయదు ఎందుకంటే ఆయన ప్రభుత్వం రాదు అని చురకలు అంటించారు.
Read Also: PAC meeting : పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ నేతల వాకౌట్