100 Phones Lost Per Day : 100 రోజుల్లో 10వేల ఫోన్లు పోగొట్టుకున్నారు..వాటిలో 4వేల ఫోన్లే దొరికాయ్
100 Phones Lost Per Day : తెలంగాణలో 100 రోజుల వ్యవధిలో ఎంతమంది ఫోన్లు పోగొట్టుకున్నారో తెలుసా ?9, 720 మంది తమ మొబైల్ ఫోన్లను 100 రోజుల టైమ్ లో పోగుట్టుకున్నారు..
- By Pasha Published Date - 02:36 PM, Tue - 25 July 23
100 Phones Lost Per Day : తెలంగాణలో 100 రోజుల వ్యవధిలో ఎంతమంది ఫోన్లు పోగొట్టుకున్నారో తెలుసా ?
9, 720 మంది తమ మొబైల్ ఫోన్లను 100 రోజుల టైమ్ లో పోగుట్టుకున్నారు..
వీటిలో కొన్ని ఫోన్లు చోరీకి గురికాగా.. ఇంకొన్ని ఫోన్లను మరిచిపోయి వదిలేశారని పోలీసుల ఎంక్వైరీలో తేలింది.
ఈ దర్యాప్తులతో ముడిపడిన మరిన్ని ఆసక్తికర వివరాలివీ..
ఫోన్లను పోగొట్టుకున్నామని.. అవి చోరీకి గురయ్యాయని పోలీసులకు జనం కంప్లైంట్స్ ఇస్తుంటారు. అలా పోయిన ఫోన్లను ట్రాక్ చేయడానికి తెలంగాణ పోలీసులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) వెబ్ సైట్ను ఉపయోగిస్తారు. CEIR అనేది కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన వెబ్ సైట్. పోయిన ఫోన్లను ట్రాక్ చేయడానికి CEIR వెబ్ సైట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్లకు లాగిన్ ఐడీలు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 100 రోజుల వ్యవధిలో పోయిన 9,720 ఫోన్లను తెలంగాణ పోలీసులు CEIR వెబ్ సైట్ ద్వారా ట్రాక్ చేయగా 4,083 ఫోన్లు(100 Phones Lost Per Day) దొరికాయి. పోలీసులు వాటిని ఆ ఫోన్ల అసలు యజమానులకు అప్పగించారు. ఈవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 554 ఫోన్లను, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 321 ఫోన్లను, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 300 ఫోన్లను, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 265 ఫోన్లను పోలీసులు తిరిగి దొరకబట్టి వాటిని ఓనర్స్ కు హ్యాండోవర్ చేశారు.
ఫోన్ పోగొట్టుకోగానే ఇలా చేయండి ..
- ఒకవేళ మీ ఫోన్ పోయినా CEIR వెబ్ సైట్ ద్వారా ఈజీగా కంప్లైంట్ చేయొచ్చు.
- తొలుత మీరు www.ceir.gov.in వెబ్ సైట్లోకి లాగిన్ కావాలి.
- ఆ వెబ్ సైట్లో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఆ లింక్ క్లిక్ చేసిన అనంతరం ఓపెన్ అయ్యే కొత్త పేజీలో పోయిన ఫోన్ లోని మొబైల్ నంబర్లు, IMEI నంబరు, ఫోన్ కంపెనీ పేరు, మోడల్, ఫోన్ కొన్న బిల్లులను అప్లోడ్ చేయాలి.
- మొబైల్ ఏ రోజు పోయింది? ఎక్కడ పోయింది? రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలను కూడా ఎంటర్ చేయాలి.
- వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడీలను ఎంటర్ చేయాలి.
- ఇవన్నీ ఎంటర్ చేశాక .. ఓటీపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ను కూడా అక్కడ నమోదు చేయాలి.
- ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది.
- ఆ ఐడీ అనేది.. మీరు పోగొట్టుకున్న ఫోన్ స్టేటస్ ను చూపిస్తుంది.
- ఆ ఫోన్ ఎక్కడుంది? ఎవరి చేతుల్లో ఉంది ? అనే వివరాలను మీకు తెలియజేస్తుంది.
- మొబైల్ ఏ కంపెనీది అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఆ ఫోన్ ఇక పని చేయకుండా చేస్తుంది.
- ఈ సాంకేతికను ఉపయోగించే పోలీసులు మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకుంటారు.
ఫోన్ ఆచూకీ దొరకగానే ఇలా చేయాలి ..
ఫోన్ దొరికిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడు చేయాల్సిన మరోపని ఫోన్ “అన్ బ్లాక్”! దీనికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఇందుకోసం మీరు మళ్ళీ అదే CEIR వెబ్ సైట్లోకి వెళ్లాలి. అక్కడ అన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఐడీని ఎంటర్ చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. లేకుంటే ఫోన్ ఆన్ కాదు. ఇదంతా చేశాక ఫోన్ పనిచేస్తున్న విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలి.
Tags
Related News
BRS vs CM Revanth: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ట్వీట్
కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.