HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ysrtp Chief Ys Sharmila Satires On Minister Ktr

KTR vs Sharmila: చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదే

మంత్రి కేటీఆర్‌పై వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.

  • Author : Vamsi Chowdary Korata Date : 21-06-2023 - 7:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR vs Sharmila
KTR vs Sharmila

KTR vs Sharmila: మంత్రి కేటీఆర్‌పై వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కేటీఆర్ ఏమన్నారంటే.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచనని అన్నారు. అలాగే పోలీసులను నమ్ముకుని రాజకీయాలు చేయడం నాకు చేతకాదు అంటూ కేటీఆర్ అన్నారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచను, పోలీసులను నమ్ముకుని రాజకీయాలు చేయడం నాకు చేతకాదు అన్న కేటీఆర్ కామెంట్స్ పై షర్మిల మాట్లాడుతూ.. కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకోవడం లేదట, ఓటర్లకు డబ్బు, మద్యం పంచట్లేదట, చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు షర్మిల.
.
పోలీసులు అడ్డు లేనిదే అడుగు కూడా బయట పెట్టలేనోడు.. ముందుగానే ప్రశ్నించే గొంతులను హౌజ్ అరెస్టులు చేయించేటోడు.. అడ్డం పొడుగు మాటలు చెప్తే నమ్మే పిచ్చోళ్లు కాదు తెలంగాణ ప్రజలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది ఆమె. . అన్నం పెట్టే రైతుకు బేడీలు వేసి, చంటి బిడ్డల తల్లులు అని చూడకుండా జైళ్లకు పంపిన హింసాత్మక పాలన మీది అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో ఆడుకుంది. పోలీసు వ్యవస్థను మీ బానిస వ్యవస్థగా మార్చారని ఆమె విమర్శించారు.

అయ్యా చిన్న దొర కేటీఆర్.. మీరు నిజంగా సుద్ధపూసలే అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేరెళ్ళలో దళితులపై పోలీసులను అడ్డుపెట్టుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదా? ఇప్పటికీ నువ్వు సిరిసిల్ల పోతే 7 ఏళ్లుగా ఆ నేరెళ్ల మొత్తం హౌజ్ అరెస్ట్ చేయడం లేదా..? మిడ్ మానేర్ ముంపు బాధితులు న్యాయ మడిగితే అరెస్టులు చేయలేదా? నిన్న గాక మొన్న వరంగల్ వెళ్తే విద్యార్థి నాయకులను, ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేయించలేదా? నీ సభల కోసం జనాలు రాకపోతే పథకాలు కట్ అని బెల్లంపల్లిలో బెదిరించలేదా?? డబ్బు, మద్యం పంచనని దొంగ మాటలు చెప్పే దొర గారు.. మొన్నే జరిగిన సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో డబ్బులు పంచలేదా? మద్యం పారించలేదా? మునుగోడు,నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటుకు 10వేలు పంచింది మీ సారథ్యంలోనే కదా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించింది.

Read More: Amazing in The Sky: నేడు కృష్ణాజిల్లాలో అద్భుతం.. మళ్లీ 200 సంవత్సరాల తర్వాత అలాంటి దృశ్యం?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alcohol
  • brs
  • elections
  • ktr
  • police
  • rajanna sirisilla
  • telangana politics
  • ys sharmila

Related News

Police deliver an unexpected shock to Uppal Balu.

Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన పని తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు చేసిన వింత చేష్టలు, ప్రమాదకర స్టంట్ల

  • Bail period ends... Bandi Bhagirath returns to Cherlapally Jail.

    Bandi Bhageerath: ముగిసిన బెయిల్ గడువు.. మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

  • BRS leader Balka Suman released on bail from Chanchalguda Jail.

    Balka Suman: చంచల్‌గూడ జైలు నుంచి బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్‌ పై విడుదల

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Janasena strengthens its position in Telangana politics; another key decision taken recently.

    Janasena Party: తెలంగాణ రాజకీయాల్లో జనసేన బలోపేతం.. తాజాగా మరో కీలక నిర్ణయం

Latest News

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd