YS Sharmila Arrested: షర్మిల అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు!
తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్ అయ్యారు.
- Author : Balu J
Date : 28-11-2022 - 5:10 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఆమె అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. నర్సంపేటకు చెందిన ఎమ్మెల్యే పి సుదర్శన్‌రెడ్డిపై షర్మిల మాట్లాడినందుకు ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల కాన్వాయ్‌పై దాడి చేశారు.
ఆమె కాన్వాయ్‌లోని ఒక బస్సు, కొన్ని వాహనాలకు TRS కార్యకర్తలు నిప్పు పెట్టారు. షర్మిల అభిమానులు టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగడంతో ఆమె అడ్డుకున్నారు. అనంతరం షర్మిలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను హైదరాబాద్ కి తరలిస్తున్నారు.