Free Bus : వీళ్లు మాములు మహిళలు కాదు..సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
- By Sudheer Published Date - 01:33 PM, Fri - 19 January 24

సాధారణంగా బస్సు, రైళ్లలో మనం చాలా సార్లు చూసి ఉంటాం. సీట్ల కోసం గొడవలు పడటం.. ఒకరిని మరొకరు తోసుకోవడం…కానీ ఇప్పుడు తెలంగాణ లో ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ… అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి ..రోడ్ ఫై కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఏకంగా చెప్పులతో కొట్టుకోవడం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రభుత్వం (Cong Govt) తీసుకొచ్చిన మహిళ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం..కొట్లాటలకు దారిస్తుంది. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రతి రోజు పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్ పేట వద్ద ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త..పెరిగి చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇద్దరి మహిళల మధ్య ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓపక్క RTC ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు పలు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఫ్రీ ని ఇంత ఫ్రీ గా వాడుకుంటారా..? అని చాలామంది ఈ ఘటనల తాలూకా వీడియోస్ చూస్తూ నవ్వుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు
సిద్దిపేట – సికింద్రాబాద్ నుంచి దుబ్బాకకి బస్సు వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్న మహిళలు. pic.twitter.com/70XJ6FpMVd
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2024
Read Also : NTR- Balakrishna Flexi War : ప్లెక్సీల్లో ఆ తప్పు జరగడంతోనే బాలకృష్ణ తీయమన్నాడా..?