HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Ntr Balakrishna Flexi War

NTR- Balakrishna Flexi War : ప్లెక్సీల్లో ఆ తప్పు జరగడంతోనే బాలకృష్ణ తీయమన్నాడా..?

  • By Sudheer Published Date - 01:21 PM, Fri - 19 January 24
  • daily-hunt
Ntr Balakrishna Flexi War
Ntr Balakrishna Flexi War

నిన్న ఎన్టీఆర్ వర్ధంతి (SR NTR Death Anniversary) సందర్బంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఏర్పాటు చేసిన జూ. ఎన్టీఆర్ ప్లెక్సీల (NTR Flexi ) తొలగింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్వయంగా ఆ ప్లెక్సీలు తీసేయాలని..వెంటనే ఆ పని చేయాలనీ చెప్పడం తో ఎన్టీఆర్ అభిమానులంతా బాలకృష్ణ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ లు రిలీజ్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా హరికృష్ణ ఫ్యామిలీ కి చంద్రబాబు , బాలకృష్ణ ఫ్యామిలీల మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను 2009 ముందు చంద్రబాబు చేరదీశారు. తమ బంధువుల కుటుంబానికి చెందిన ప్రణతిని జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఇచ్చి వివాహం జరిపించడంలో చంద్రబాబు బాగా చొరవ తీసుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా జూనియర్‌ ఎన్టీఆర్‌.. టిడిపి పార్టీకి మద్దతుగా విస్తృత ప్రచారం చేసి ఓ ఊపు తెచ్చారు.అయితే ప్రచారం చేసి.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చే క్రమంలో ఖమ్మం వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని నెలలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌కు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని, తన తాత ఎన్టీఆర్‌కు ఏదో ఒకరోజు తాను రాజకీయ వారసుడిని అవుతానని జూనియర్‌ ఎన్టీఆర్‌ భావిస్తున్నారని.. ఆయన్ను అభిమానించే వారు విస్తృతంగా భావించటం, వ్యాఖ్యానించడం తో రెండు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత లోకేష్‌ను టిడిపి పార్టీకి భవిష్యత్‌ నాయకుడిగా ప్రొజెక్ట్‌ చేసే విధంగా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలు.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించాయి. ఎన్టీఆర్‌ను కాబోయేసీఎం గా.. ఎన్టీఆర్‌ వారసుడిగా ప్రస్తావిస్తూ అభిమానులు పలు సందర్భాల్లో ఫ్లెక్సీలు పెడుతుండటంతో.. దీని వెనుక ఎన్టీఆర్ హస్తం ఉండనే భావన టిడిపి శ్రేణుల్లో మొదలుకావడం తో ఇరువురి మధ్య గొడవ మరింత ముదిరింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్టీఆర్ సైతం రాజకీయాలకు , నందమూరి వేడుకలకు అంటీముట్టనట్లే ఉంటూ వచ్చారు. అయినప్పటికీ టిడిపి శ్రేణులు ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత రెచ్చిపోతూ..ప్లెక్సీ లు కడుతూ వారి మద్దతును తెలుపుతూ వస్తున్నారు. ఇక నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా అలాగే చేసారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు, మనవళ్లు, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ముందుగా జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. ఆ తర్వాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. అయితే సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూ.ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు.

జూ. ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిన కాసేపటికే.. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. అయితే బాలకృష్ణ కారెక్కి అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని.. బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద రచ్చ నడుస్తుంది. కావాలనే ఎన్టీఆర్ దూరం పెడుతున్నారని..ప్లెక్సీలు తీసేసినంత మాత్రం మా గుండెల్లో ఉన్న అభిమానాన్ని చెరపలేరని , మా ప్రతాపం ఏంటో ముందు ముందు చూపిస్తామని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

ఈ క్రమంలో ఓ వార్త బయటకు వచ్చింది. బాలకృష్ణ ఎన్టీఆర్ ప్లెక్సీ లు తీయమని చెప్పలేదని..ప్లెక్సీ ల మీద స్వాగతం..సుస్వాగతం అని రాసి ఉండడం వల్ల వాటిని తీసేయాలని సూచించారని..ఇలాంటి కార్యక్రమాలకు స్వాగతాలు పలకవద్దనే ఉద్దేశ్యంతో ఆలా చెప్పినట్లు బాలకృష్ణ వర్గీయులు చెపుతున్నారు. మరి నిజంగా బాలకృష్ణ ఆ ఉద్దేశంతోనే అన్నారా..? లేక ఎన్నికల సమయంలో ఇలాంటివి బయటపడితే పార్టీకి నష్టం వస్తుందని చంద్రబాబు ఇలా కవర్ చేస్తున్నాడా..? అనేది వారికీ తెలియాలి. ఏది ఏమైనప్పటికి ఎన్నికల సమయంలో ఇలాంటివి బయటకు వస్తే పార్టీకే నష్టం తప్ప మరోటి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

https://twitter.com/ActualIndia/status/1747842590723150208?

Read Also : Free Maternity Care : ఆ ఆస్పత్రిలో ఫ్రీ డెలివరీ.. రామమందిర ప్రారంభోత్సవ వేళ సేవాభావం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • flexi war
  • ntr
  • NTR death anniversary
  • NTR ghat
  • TDP-Jr NTR

Related News

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా

Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

  • Balakrishna

    Balakrishna : తెలంగాణకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన బాలకృష్ణ

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd