HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Women Are The Target Deputy Cm Bhatti Comments

Deputy CM Bhatti: మహిళలే టార్గెట్‌.. డిప్యూటీ సీఎం భ‌ట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

విద్యపై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణకు దక్కుతుందని ఆయన అన్నారు.

  • Author : Gopi Date : 31-01-2025 - 2:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy CM Bhatti
Deputy CM Bhatti

Deputy CM Bhatti: మహిళల అభివృద్ధే కేంద్రంగా నిధుల కేటాయింపు జ‌రుగుతుంద‌ని తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti) అన్నారు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

విద్యపై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణకు దక్కుతుందని ఆయన అన్నారు. విద్యా రంగ అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో పాఠశాలను 200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని, ఇప్పటికే 60 స్కూళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు.

మహిళలకు విద్యను అందిస్తే ఆ ఫలితం కేవలం ఆమెకే కాకుండా కుటుంబానికి.. సమాజానికి మేలు జరుగుతుందని వివరించారు. కుటుంబ వ్యవస్థ దేశానికి బలం, ఆ కుటుంబ వ్యవస్థను నడిపించే శక్తి అమ్మ, భార్య, సోదరీ రూపంలో ఉన్న మహిళ అని అభివర్ణించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మహిళల అభివృద్ధికి అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. వారికి చదువు, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Also Read: Economic Survey: ఆర్థిక సర్వే అంటే ఏమిటో తెలుసా? ఇది ఎప్పుడు మొద‌లైంది?

మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని.. విద్యార్థినీలు కళాశాలలకు వెళ్లేందుకు, మహిళలు ఉచితంగా పని ప్రదేశాలకు వెళ్లేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని.. వీటితో రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోదని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. సహజంగా వీటిని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తారు అందుకు భిన్నంగా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇందిరమ్మ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తుందని తెలిపారు.

సోలార్ విద్యుత్ లో పెట్టుబడుల కోసం బ్యాంక్ లింకేజీ ఇప్పించడం, మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేయడం మహిళలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పథకం దేశంలోనే గొప్ప పథకంగా అభివర్ణించారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దబోతున్నామని వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, వారి తరఫున వడ్డీని ఆర్థిక శాఖ చెల్లిస్తుందని వివరించారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిరాగాంధీ మహిళలు ఏ పనినైనా చేయగలరని నిరూపించారని తెలిపారు. 1959లో 15 మంది విద్యార్థినీలతో ప్రారంభమైన సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల ప్రస్తుతం 3000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమని, ఈ కళాశాలలో చదివిన విద్యార్థినిలు గొప్ప ప్రతిభను కనబరుస్తున్నారని అభినందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhatti Comments
  • congress
  • Deputy CM Bhatti
  • hyderabad
  • telangana
  • telugu news

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Latest News

  • CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

  • NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd