HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will The Congress Government Deceive The Bcs

BC Reservation : బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతుందా..?

BC Reservation : స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది. కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు స్టేను సమర్థిస్తూ కేసును తిరస్కరించింది

  • By Sudheer Published Date - 10:28 AM, Tue - 18 November 25
  • daily-hunt
We have 3 ways to implement BC reservations: CM Revanth Reddy
We have 3 ways to implement BC reservations: CM Revanth Reddy

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చేసిన కాంగ్రెస్ హామీ ప్రస్తుతం తీవ్ర రాజకీయ, న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. 2023 ఎన్నికల సమయంలో “కామారెడ్డి డిక్లరేషన్” ద్వారా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ప్రకటించి, కాంగ్రెస్ బీసీ ఓటర్లను ఆకర్షించింది. అనంతరం హౌస్-టు-హౌస్ సర్వే చేసి, బీసీలు 56% జనాభా ఉన్నారని రిపోర్టు ప్రకటించారు. ఆ డేటా ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదం చేశారు. కానీ ఇది సుప్రీం కోర్టు 50% రిజర్వేషన్ క్యాప్‌ను దాటిపోవడం వల్ల, ఆ బిల్లులు అమల్లోకి రావడం కోసం న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి.

Jobs : RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!

ఆమోదించిన బిల్లులపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు స్టే చేసింది. స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది. కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు స్టేను సమర్థిస్తూ కేసును తిరస్కరించింది. దీంతో 42% బీసీ రిజర్వేషన్ల అమలు ప్రస్తుతానికి పూర్తిగా నిలిచిపోయినట్లైంది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో బిల్లును చేర్చితే ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు అయ్యే అవకాశమున్నప్పటికీ, దానికి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ అవసరం. ప్రస్తుత రాజకీయ సమీకరణల్లో ఇది సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమల్లో ఉండటానికి కారణం కూడా ఇదే. తెలంగాణలో అదే విధానం అమలుకావడానికి కేంద్ర ఆమోదం తప్పనిసరి.

ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల వలన 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయటం అసాధ్యమని స్పష్టమైనప్పటికీ, ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించడానికి మొహమాటపడుతోంది. రిజర్వేషన్లు ఇచ్చిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీ నెరవేర్చడం అసాధ్యమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు నిజాలు వివరించకుండా మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా బీసీ వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో బీసీలు మోసపోయామని భావించే ప్రమాదం కూడా పెరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను పారదర్శకంగా తెలియజేసి, చట్టబద్ధమైన మార్గాల్లో సాధ్యమైన పరిష్కారాలను ముందుకు తెచ్చే అవసరం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Reservation
  • bc reservation percentage in telangana
  • Congress Govt
  • telangana

Related News

Jobs

Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Jobs: తెలంగాణ నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గొప్ప సంతోష వార్తను అందించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం ఏడు వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించడం యువతలో

  • Maoist

    Anti Maoist Operation : భారీ ఎన్‌కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?

  • 4 National Highways In Tela

    Telangana Roads: తెలంగాణ లో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • Telangana Cabinet

    Local Body Elections: స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై బిగ్ అప్డేట్‌.. అప్పుడే నోటిఫికేష‌న్‌!?

  • Saudi Bus Accident

    Saudi Bus accident : సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం- సీఎం రేవంత్

Latest News

  • Piracy : ఇక పైరసీ భూతం వదిలినట్లేనా..? ఇండస్ట్రీ కి మంచి రోజులు రాబోతున్నాయా..?

  • Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!

  • Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి భారీ స్పందన

  • BC Reservation : బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతుందా..?

  • Saudi Bus Accident: 3 తరాలు బూడిద..ఆ తల్లి ఆవేదన అంత ఇంత కాదు !!

Trending News

    • Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు న‌యా ఫార్ములా?!

    • RCB: ఆర్సీబీపై ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌస్ క‌న్ను!

    • iBomma: ఐబొమ్మ వ‌ల‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఎంత లాస్ వ‌చ్చిందంటే?

    • Smriti Mandhana: ఈనెల 23న‌ టీమిండియా ఓపెన‌ర్ పెళ్లి.. హాజ‌రుకానున్న రోహిత్‌, కోహ్లీ!

    • Golden Passport: గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలు ఏంటి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd