PV Sindhu Marriage : పీవీ సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు ?
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నగరానికి చెందిన వెంకట దత్త సాయిని(PV Sindhu Marriage) పీవీ సింధు పెళ్లి చేసుకోనున్నారు.
- By Pasha Published Date - 11:16 AM, Tue - 3 December 24

PV Sindhu Marriage : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి ఈ నెల 22న జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో ఈ మ్యారేజ్ జరగనుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నగరానికి చెందిన వెంకట దత్త సాయిని(PV Sindhu Marriage) పీవీ సింధు పెళ్లి చేసుకోనున్నారు. ఈనెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Also Read :Elon Musk Package : షాకింగ్.. రూ.4.7 లక్షల కోట్ల శాలరీ ప్యాకేజీకి మస్క్ అనర్హుడు.. కోర్టు తీర్పు
వెంకట దత్త సాయి ఎవరు ?
- వెంకట దత్త సాయి ప్రస్తుతం హైదరాబాద్‌లోని పొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
- ఆయన 2018లో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఫ్లేమ్ యూనివర్సిటీలో బీబీఏ కోర్సును పూర్తి చేశారు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఆయనకు స్పెషాలిటీ ఉంది.
- బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వెంకట దత్తసాయి మాస్టర్స్ డిగ్రీ చేశారు. డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో ఆయనకు స్పెషాలిటీ ఉంది.
- జేఎస్‌డబ్ల్యూ కంపెనీలో ఇంటర్న్‌గా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అదే కంపెనీలో ఇన్ హౌజ్ కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు.
- 2019 సంవత్సరం నుంచి సోర్ యాపిల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా, పొసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్తసాయి వ్యవహరిస్తున్నారు.
- హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రముఖ బ్యాంకులు లోన్లు, క్రెడిట్ కార్డులను మంజూరు చేసే క్రమంలో ఇన్‌స్టంట్ క్రెడిట్ స్కోరును చూపించే సాఫ్ట్‌వేర్ల తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు.
- పీవీ సింధు, వెంకట దత్తసాయి కుటుంబాలది పాత పరిచయం. ఆ పరిచయాల ఆధారంగా వీరి పెళ్లి సంబంధం కుదిరింది. నెల క్రితమే పెళ్లిని ఖాయం చేసుకున్నారు.
- మొత్తం మీద ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఈ ఇద్దరి పెళ్లి గురించి సెర్చింగ్స్ బాగా జరుగుతున్నాయి.