HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Where Is Mp Santhosh

MP Santhosh Kumar : తెలంగాణ ప్రచారంలో కనిపించని బిఆర్ఎస్ ఎంపీ సంతోష్ ..?

కేసీఆర్ కు నీడలా ఎప్పుడు ఉండే సంతోష్..తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కనిపించకపోయేసరికి అనేక అనుమానాలు వస్తున్నాయి

  • Author : Sudheer Date : 20-11-2023 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mp Santhosh
Mp Santhosh

తెలంగాణ ఎన్నికల (TS Polls) పోలింగ్ కు సరిగ్గా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. ఈ తొమ్మిది రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం కూడా ఎంతో కీలకం. ఓటర్లను (Voters) ప్రసన్నం చేసుకోవడం..వారికీ కావాల్సినవన్నీ ముట్టజెప్పడం..ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా..వారి మనసు మారకుండా ఉండేలా చేసుకోవడం..ఇదే క్రమంలో ప్రత్యర్థి పార్టీల ఫై విమర్శల వర్షం కురిపించడం..ఇలా ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి చేయాల్సిన..చూసుకోవాల్సిన పనులు.

ఇక ఎన్నికల ప్రచారం లో ముందు నుండి గులాబీ బాస్ (KCR) దూకుడు గానే ఉన్నారు. ఎన్నికలు రాబోతున్నాయని తెలిసే..ముందుగా అభ్యర్థులను ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ప్రకటించడమే ఆలస్యం వారిని ప్రచారానికి ముమ్మరం చేసారు. తాను కూడా గతంలో కంటే ఎక్కువగా ప్రచారంలో దూకుడు కనపరుస్తున్నాడు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రతి రోజు మూడు , నాల్గు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రత్యర్థి పార్టీల ఫై విమర్శల వర్షం కురిపిస్తూనే..పదేళ్ల బిఆర్ఎస్ (BRS) అభివృద్ధి చూడండి..అవన్నీ చూసి ఓటు వెయ్యండని కోరుకుంటున్నారు.

మరోపక్క కేటీఆర్ (KTR) , హరీష్ రావు (Harishrao), కవిత (Kavitha) ఇలా కుటుంబ సభ్యులంతా ప్రచారంలో బిజీ గా ఉంటె..ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) మాత్రమే ఎక్కడ కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి , షాక్ కు గురి చేస్తుంది. సంతోష్ కుమార్..నిత్యం కేసీఆర్ (KCR) వెంట ఉంటారనే సంగతి తెలిసిందే. కేసీఆర్ గల్లీకి వెళ్లిన ఢిల్లీకి వెళ్లిన ఆయన వెంట సంతోష్ ఉండాల్సిందే. కేసీఆర్ కు నీడలా ఎప్పుడు ఉండే సంతోష్..తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కనిపించకపోయేసరికి అనేక అనుమానాలు వస్తున్నాయి.

గత కొద్దీ రోజులుగా కేసీఆర్ కుటుంబంలో పలు గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తుంది. ఆ గొడవలే సంతోష్ ను కేసీఆర్ ను దూరం పెట్టాయని అంటున్నారు. అందుకే సంతోష్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సంతోష్ ను కేసీఆర్ దూరం పెట్టారని..ఆ దూరమే ఆయన్ను ఎన్నికల్లో కనిపించకుండా చేసేయని అంటున్నారు. మరి నిజంగా ఇదేనా..? లేక మరో కారణం ఏదైనా ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి సంతోష్ కుమార్ లేని లోటు ప్రచారంలో కనిపిస్తుంది.

Read Also : KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరంతో కేటీఆర్ భేటీ, ఓటుబ్యాంక్ పై గురి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • election campaign
  • kcr
  • mp santhosh kumar

Related News

CM Revanth Reddy doesn't have that courage: KTR

KCR వ్యక్తిత్వంపై సీఎం రేవంత్ విషం చిమ్ముతున్నాడు – కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, కానీ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ ఆరోపించారు

  • Questions Asked By Sit To K

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

Latest News

  • వారంలో భారీగా తగ్గిన పసిడి ధరలు

  • మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు – భట్టి

  • ‘మధిర అంటే నాకు ప్రాణం’ – భట్టి విక్రమార్క

  • క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

  • భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైక్ ధరలు!

Trending News

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd