HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ktr Meets With Private Teachers Forum Targets Vote Bank

KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరంతో కేటీఆర్ భేటీ, ఓటుబ్యాంక్ పై గురి

 రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(TPTF) బియారెస్(BRS) పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

  • Author : Balu J Date : 20-11-2023 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Tweet
KTR Election Campaign

KTR: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(TPTF) బియారెస్(BRS) పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారితో TPTF రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ESI, EPF అమలు, 12 నెలల జీతం, ప్రభుత్వం ప్రకటించిన సెలవుల అమలు, అధిక సమయపాలన వంటి సమస్యలతో పాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని మంత్రి గారిని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం రెగ్యులేషన్ కమిటీ వేయాలనీ , జీవో ఎమ్మెస్ నెం-1 లో మార్పులు చేసి పునరుద్దిరించాలని కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయనీ పరిష్కారంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను U-DISE ద్వారా ఆన్లైన్ లో పొందు పరచాలనీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉపాధ్యాయుల వివరాలు వారి సంఖ్య తెలిస్తే వారికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వారికి అందేలాగా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలకు పరిష్కారం చేస్తామని , అన్ని సమస్యలను విడతల వారిగా పరిష్కరించుకుందామనీ హామి ఇచ్చారు. అనంతరం సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం 13 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ (TPTF) అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్భవించిన TPTF, నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, నేడు తెలంగాణ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు.

కరోనా కష్ట సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని మేము చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి, మానవతా దృక్పథంతో ప్రతి ప్రైవేట్ టీచర్ కు నెలకు 2 వేల రూపాయల నగదు, 25 కిలోల సన్నబియ్యాన్ని ఇచ్చి ఆదుకున్న విషయాన్ని మేము మరవలేదని తెలిపారు. భారతదేశంలోనే ప్రైవేట్ ఉపాధ్యాయులను గుర్తించి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ననీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా బియారెస్(BRS) పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో ప్రాణాలకు తెగించి పోరాడిన నాయకుడు, అదే చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, సుపరిపాలనను అందించే సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ గారు అనీ‌, అతని చేతిలోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.అందుకోసం రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు బియారెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తమ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చిన కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్యా శివరాజ్, ప్రధాన కార్యదర్శి నిరుపమ సంజయ్, కోశాధికారి నవీన్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు రేణుక పవన్, అమీరుద్దిన్, సుబ్బలక్ష్మి, భాస్కర్ రాథోడ్, అప్జల్ తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • brs party
  • ktr
  • private teachers

Related News

Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

ధైర్యవంతమైన మరియు నిర్ణయాత్మక నాయకత్వంతో, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, KTRను మరియు మొత్తం BRSను ఇబ్బందుల్లో పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని భావించి సవాలు విసిరిన అహంకారి KTR, ఇప్పుడు తప్పించుకునే మార్గాల కోసం నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీలో గంభీరమైన చర్చకు బదులు

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd