Sridhar Babu : ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం – మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu : రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణాలను పూర్తి మాఫీ చేశామని, ఇందుకోసం రూ.21 వేల కోట్ల ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.
- Author : Sudheer
Date : 08-12-2024 - 8:53 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. ప్రజా పాలనా ఉత్సవాల్లో మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణాలను పూర్తి మాఫీ చేశామని, ఇందుకోసం రూ.21 వేల కోట్ల ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. రూ.2 లక్షల పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేయడంపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రి తెలిపారు. కొన్ని కారణాల వల్ల హామీల అమలు ఆలస్యమవుతుందని, తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఏమాత్రం వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి హామీని నెరవేర్చేందుకు నాయకులంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని, ప్రజల సంక్షేమం కోసం కృషి కొనసాగుతుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు రైతుల నమ్మకాన్ని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రుణమాఫీతో పాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీల అమలుపై కూడా దృష్టి పెట్టామని మంత్రి తెలియజేశారు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం లాంటి హామీల అమలు కాస్త సమయం పడుతుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే.. నిరుద్యోగ యువత బాధను అర్థం చేసుకుని.. ఏకంగా 55 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ (BRS) హయాంలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని తెలిపారు. కానీ ప్రజల బాగోగులు, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, తాము అహర్నిశలు పనిచేస్తామని అన్నారు. మంత్రిత్వ శాఖపై ఉన్న బాధ్యతలను నెరవేర్చడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందని, ప్రజలు ఇచ్చిన మద్దతుకు తగిన విధంగా పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
Read Also : Manchu Manoj : నడవలేని స్థితిలో మంచు మనోజ్..అంత దారుణంగా కొట్టడమేంటి..?